‘చట్టం బలమైన ఆయుధం, అయితే ఎవరిని కాపాడటానికి మనం దానిని ఉపయోగిస్తున్నాం అనేది ప్రధానం’ ఇదే అంశంపై తెరకెక్కింది ‘జై భీమ్’ చిత్రం. ఉండటానికి భూమి, కనీస ఆహారాన్ని పొందడానికి రేషన్ కార్డు, ఓటర్ల లిస్టులో పేరులేని గిరిజనులను తప్పుడు కేసుల్లో పోలీసులు ఇరికించినప్పుడు వారి తరఫున పోరాటం చేసే న్యాయవాదిగా సూర్య ఇందులో నటించారు. అతనితో కోర్టులో తలపడే మరో కీలకమైన లాయర్ పాత్రను రావు రమేశ్ పోషించగా, పోలీస్ అధికారి పాత్రలో ప్రకాశ్ రాజ్…
సాధారణంగా నటీనటుల రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరుగా ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం సినిమాల్లో నటించిన పాత్రల్లోనే నిజ జీవితంలోనూ జీవిస్తారు. ఓ స్టార్ హీరో సినిమాలో నటించిన నటుడు రీల్ లైఫ్ లో చేసిన పనిని రియల్ లైఫ్ లోనూ చేసి అందరికీ షాకిచ్చాడు. డ్రగ్స్ సంబంధించిన కేసులో పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే… Read Also : ‘పుష్ప’ సెకండ్ సింగిల్ కు హీరోయిన్ పేరు ! కోలీవుడ్ స్టార్ హీరో…
సౌత్ స్టార్స్ కపుల్ సూర్య-జ్యోతిక నేడు 15వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. వీరిద్దరి లవెబుల్ జోడికి కోలీవుడ్ లోనే కాదు, సౌత్ అంతటా కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. కొద్దిరోజుల పాటు ప్రేమలోవున్న వీరు 2006లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తరువాత జ్యోతిక సినిమాలు చేసే అవకాశం పుష్కలంగా వున్న.. కాదనున్నది. ఆపై హస్బెండ్ సూర్య సైతం సపోర్ట్ చేశాడు. అయినా జ్యోతిక పూర్తిగా కుటుంబానికే పరిమితం అయింది. ఆ…
సూర్య హీరోగా నటించిన ‘సూరారై పోట్రు’ చిత్రం తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా విడుదలై చక్కని ఆదరణ పొందింది. థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సూర్య ఓటీటీ స్ట్రీమింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందులోనే జనం ముందుకు వచ్చింది. దాంతో ఇంటి డ్రాయింగ్ రూమ్ లోనే వాళ్ళు ఈ చిత్రాన్ని చూసి ఆనందించారు. ఈ సినిమాను హిందీలోనూ రీమేక్ చేయబోతున్నట్టు ఆ మధ్య సూర్య ప్రకటించాడు. తమిళ వర్షన్ ను డైరెక్ట్ చేసి సుధా…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన “సూరారై పొట్రు” తెలుగులో “ఆకాశం నీ హద్దురా” అనే టైటిల్ తో విడుదలైన విషయం తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. డైరెక్ట్ ఓటిటిలో ఈ మూవీని రిలీజ్ చేసినప్పటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాదు ‘ఆస్కార్’ రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంది. ఎన్నో రికార్డులు సృష్టించి విమర్శకులతో…
సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకు అటు విమర్శకుల ప్రశంసలతో పాటు ఇటు ప్రేక్షకుల ఆదరణ కూడా లభించింది. ఎయిర్ డక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ బయోపిక్ గా సుధకొంగర తెరకెక్కించిన ఈ సినిమాకు సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లోనూ రీమేక్ అవుతోంది. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చూశారు. అమితాబ్ బచ్చన్ తన పర్సనల్ బ్లాగ్ లో ఇదే…
తమిళనాట దర్శకుడు బాలాకి మంచి క్రేజ్ ఉంది. వివాదాస్పద అంశాలతో హార్డ్ హిట్టింగ్ సినిమాలను చేస్తుంటాడు బాల. అందుకే స్టార్స్ కూడా తన సినిమాలో నటించటానికి ఆసక్తి చూపిస్తుంటారు. బాల చివరగా జ్యోతిక నటించిన 2018 థ్రిల్లర్ డ్రామా ‘నాచియార్’ ను తెరకెక్కించాడు. ఆ తర్వాత విక్రమ్ కుమారుడు తో చేసిన ‘వర్మ’ సినిమా నచ్చలేదని వేరే దర్శకుడుతో రీ-షూట్ చేసి విడుదల చేశారు. ప్రస్తుతం బాల మలయాళ ‘జోసెఫ్’ ఆధారంగా ‘విశిథిరన్’ అనే సినిమాను పద్మకుమార్…
కోలీవుడ్‌లోని ప్రముఖ నటీమణులలో జ్యోతిక ఒకరు. స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె సందేశాత్మకమైన సామాజిక సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. అయితే ఆమె సోషల్ మీడియాకు మాత్రం దూరంగానే ఉన్నారు. దీంతో జ్యోతిక ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ సరిగ్గా లేకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం సాంకేతిక అభివృద్ధిలో భాగంగా సోషల్ మీడియా అనేది ప్రజల జీవితాల్లో ఒకటిగా మారిపోయింది. సెలెబ్రిటీలు సైతం ఎలాంటి సమస్యా లేకుండా…
దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహించిన “అన్నాబెల్లె సేతుపతి” హారర్ థ్రిల్లర్ లో విజయ్ సేతుపతి, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో నటించారు. రాధికా శరత్‌కుమార్, రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. “అన్నాబెల్లె సేతుపతి” సినిమాలో విజయ్ సేతుపతి మరియు తాప్సీ పన్నూ మొదటిసారిగా స్క్రీన్ షేర్ చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ జైపూర్‌లో జరిగింది. ఒక నెలలోపే షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ…
తమిళనాట కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు అగ్ర దర్శకులు. తెలుగులో యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ అందరూ కలసి గిల్డ్ పేరుతో సినిమాలు తీస్తున్నట్లు తమిళనాట అగ్రదర్శకులందరూ కలసి ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. తెలుగులో నిర్మాతలు ఎవరికివారు హీరోలతో టై అప్ పెట్టుకుని సినిమాలు తీస్తుంటే తమిళంలో మాత్రం దర్శకులందరూ కలసి ఒకే గొడుగు కింద సినిమాలు తీయబోతున్నారు. మణిరత్నం, శంకర్, గౌతమ్ మీనన్, వెట్రిమారన్, మిస్కిన్, లింగుస్వామి, మురుగదాస్, బాలాజీ శక్తివేల్, శశి, లోకేశ్ కనకరాజ్…