కోవిడ్, లాక్‌డౌన్ సమయంలో ఆకాశం నీ హద్దు రా, జై భీమ్ వంటి అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన కోలీవుడ్ స్టార్ సూర్య నెక్స్ట్ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మాతగా పాండిరాజ్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ET (ఎథర్క్కుం తునింధవన్)తో సూర్య థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా హక్కులను ఫ్యాన్సీ రేటుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also : SVP Song Leaked : పనిస్తే ఇలాంటి పని… వాడికి తెలియాలంటూ తమన్ ఎమోషనల్
టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకుంది. సూర్యకు ఉన్న భారీ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని తెలుగులో ‘ఈటీ’ పేరుతో విడుదల చేయబోతోంది. ఈ సినిమా హక్కులను ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుందట ఏషియన్ సంస్థ. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10న ఒకేసారి విడుదల కానుంది. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్, డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. ఈ చిత్రంలో వినయ్ రాయ్, సత్యరాజ్, రాజ్‌కిరణ్, శరణ్య పొన్వన్నన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.