కేంద్రమంత్రి సురేష్ గోపి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సినిమాల్లో నటించకపోవడం వల్ల తన ఆదాయం తగ్గిందని.. తిరిగి సినిమాల్లోకి వెళ్లి ఆదాయాన్ని చక్కదిద్దుకుంటానని వెల్లడించారు. ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు.
భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT ప్లాట్‌ఫారమ్ అయిన ZEE5 2025లో మరో సూపర్‌హిట్ ప్రీమియర్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సంక్రాంతికి వస్తున్నం, రాబిన్‌హుడ్, భైరవం వంటి వరుస తెలుగు సూపర్‌హిట్‌లను అందించిన తర్వాత ZEE5 తెలుగు ఇప్పుడు మరో అద్భుతమైన సినిమాను అందించబోతోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన మాలీవుడ్ లీగల్ డ్రామా ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ ఆగస్టు 22న తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే తమిళం, మలయాళ, కన్నడ,…
విమర్శకుల ప్రశంసలు పొందిన మాలీవుడ్ లీగల్ డ్రామా ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది. సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన J.S.K మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించగా.. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై J. ఫణీంద్ర…
Anupama Parameshwaran : క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, కేంద్రమంత్రి, నటుడు సురేష్ గోపీ కొత్త సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. ఈ సినిమా విషయంలో మొదటి నుంచి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాకే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం నిరాకరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. బోర్డు తీరుపై మలయాళ సినీ పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు బోర్డ్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేసింది.…
Kerala High Court: కేంద్రమంత్రి, మలయాళ స్టార్ హీరో సురేష్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్ నటించిన మళయాల సినిమా ‘‘JSK - జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’’లో ‘‘జానకి’’ పేరు ఉపయోగించడంతో వివాదం ప్రారంభమైంది. ఈ పేరు ఉపయోగించడం ద్వారా మతపరమైన సెంటిమెంట్లు దెబ్బతింటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కేరళ హైకోర్టు శుక్రవారం ప్రశ్నించింది.
యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు . కన్నడ, తమిళ, మలయాళ పరిశ్రమల్లోనూ ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తెలుగు లోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే తన మాతృభాష మలయాళం అయినా, ఎందుకు ఆమె సినిమాలు ఎక్కువగా తెలుగులో వచ్చాయి ? ఇదే ప్రశ్నకు ఆమె ఇటీవల ఇచ్చిన సమాధానం, ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. Also Read : Lenin : లెనిన్ మూవీకి…
Waqf Issue: కేరళలో ‘వక్ఫ్’ వివాదం రాజుకుంది. తమ భూమిపై వక్ఫ్ బోర్డు క్లెయిమ్‌పై ఎర్నాకులం జిల్లాలోని మునంబం గ్రామంలోని 610 కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి. ఆందోళన చేస్తున్న బాధితులకు కేంద్ర మంత్రి సురేష్ గోపి మద్దతు తెలిపారు. బుధవారం వీరిని కలిసి పరామర్శించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ కుటుంబాలు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తున్న వారి భూమికి రెవెన్యూ హక్కుల్ని డిమాండ్ చేస్తున్నారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీని "భారతమాత" అని కేంద్రమంత్రి సురేష్ గోపీ శనివారం వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో.. ఆ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీకి 'తల్లి' అని అన్నానని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఈరోజు మీడియాకు తెలిపారు. తాను హృదయపూర్వకంగా మాట్లాడే వ్యక్తినని.. ఇందిరా గాంధీ గురించి తాను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని అన్నారు. ఎవరికీ నచ్చినా, నచ్చకపోయినా... కేరళలో కాంగ్రెస్ పార్టీకి తండ్రి కె. కరుణాకరన్.. భారతదేశంలో…
మాజీ ప్రధాని ఇందిరాగాంధీని 'భారతమాత'గా అభివర్ణించారు కేంద్రమంత్రి సురేష్ గోపి.. అంతేకాకుండా.. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్‌ను 'ధైర్యవంతమైన నిర్వాహకుడు' అని కొనియాడారు. కరుణాకరన్, ఇకె నాయనార్ తన "రాజకీయ గురువులు" అని అన్నారు. పున్‌కున్నంలో ఉన్న కరుణాకరన్ స్మారకం "మురళీ మందిరం"ని సందర్శించిన అనంతరం మంత్రి సురేష్ గోపి విలేకరులతో మాట్లాడారు.
సార్వత్రిక ఎన్నికల్లో కేరళ నుంచి గెలిచిన ఒకే ఒక్కడైన బీజేపీ ఎంపీ, నటుడు సురేష్ గోపికి అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి దక్కింది. కేరళలో త్రిసూర్ పార్లమెంట్ నుంచి ఎన్నికైన మొదటి బీజేపీ ఎంపీ సురేషే. సీపీఐ అభ్యర్థి సునీల్ కుమార్‌పై విజయం సాధించారు.