OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT ప్లాట్‌ఫారమ్ అయిన ZEE5 2025లో మరో సూపర్‌హిట్ ప్రీమియర్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సంక్రాంతికి వస్తున్నం, రాబిన్‌హుడ్, భైరవం వంటి వరుస తెలుగు సూపర్‌హిట్‌లను అందించిన తర్వాత ZEE5 తెలుగు ఇప్పుడు మరో అద్భుతమైన సినిమాను అందించబోతోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన మాలీవుడ్ లీగల్ డ్రామా ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ ఆగస్టు 22న తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
Also Read : Manchu Vishnu : సినిమాల కోసం వందకోట్లు పెట్టుబడి పెడుతున్న మంచు విష్ణు
Also Read
సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన J.S.K మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించగా.. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై J. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. ప్రఖ్యాత న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సహాయంతో లైంగిక వేధింపుల నుండి బయటపడిన జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి, న్యాయవాది చివరకు గెలిచారా? లేదా? అసలు జానకి జీవితంలో ఏం జరిగింది? న్యాయం కోసం చేయాల్సి వచ్చిన పోరాటం ఏంటి? అనే ప్రశ్నల్ని లేవనెత్తేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ చిత్రంలో గిరీష్ నారాయణన్ స్వరపరిచిన పాటలు, గిబ్రాన్ అద్భుతమైన నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ఈ చిత్రానికి రెనదివే సినిమాటోగ్రఫీ అందించారు. ఈ ఆగస్టు 22న ‘J.S.K – జానకి V vs. స్టేట్ ఆఫ్ కేరళ’ తెలుగు లో ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్‌ను ZEE5లో మాత్రమే చూడండి. ఈ వీకెండ్‌ను ఉత్కంఠభరితమైన కోర్టు డ్రామాతో ఎంజాయ్ చేయండి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!