Suresh Gopi: ఇందిరాగాంధీని ‘భారతమాత’గా అభివర్ణించిన కేంద్రమంత్రి..
- ఇందిరాగాంధీని భారతమాతగా అభివర్ణించిన కేంద్రమంత్రి సురేష్ గోపీ
- కె.కరుణాకరన్ ధైర్యవంతమైన నిర్వాహకుడు- సురేష్ గోపీ
- కరుణాకరన్.. ఇకె నాయనార్ నా "రాజకీయ గురువులు" - సురేష్ గోపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘భారతమాత’గా అభివర్ణించారు కేంద్రమంత్రి సురేష్ గోపి.. అంతేకాకుండా.. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్‌ను ‘ధైర్యవంతమైన నిర్వాహకుడు’ అని కొనియాడారు. కరుణాకరన్, ఇకె నాయనార్ తన “రాజకీయ గురువులు” అని అన్నారు. పున్‌కున్నంలో ఉన్న కరుణాకరన్ స్మారకం “మురళీ మందిరం”ని సందర్శించిన అనంతరం మంత్రి సురేష్ గోపి విలేకరులతో మాట్లాడారు.
Pushpa 2 : పుష్ప 2 తప్పుకోవడంతో పోటీలోకి వచ్చిన ఆ రెండు సినిమాలు..?
Also Read
కరుణాకరన్ స్మారక సందర్శన రాజకీయంగా చూడొద్దని.. తన “గురువు”కి నివాళులు అర్పించేందుకే ఇక్కడకు వచ్చానని సురేష్ గోపీ చెప్పారు. కరుణాకరన్, ఇకె నాయనార్ కుటుంబాలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. తాను ఇందిరాగాంధీని “భారతమాతగా భావిస్తానని, కరుణాకరన్ “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తండ్రి” అని గోపి అన్నారు. కరుణాకరన్‌ను కేరళలో కాంగ్రెస్‌కు “తండ్రి”గా అభివర్ణించడం.. దక్షిణాది రాష్ట్రంలోని పార్టీ వ్యవస్థాపకులు, సహ వ్యవస్థాపకులను అగౌరవపరచడం కాదని ఆయన వివరించారు.
Minister Achchennaidu: విత్తనాలు, ఎరువుల కొరత రావొద్దు.. మంత్రి అచ్చెన్న ఆదేశం.
కరుణాకరన్ పరిపాలనా సామర్థ్యాలను కేంద్రమంత్రి సురేష్ గోపీ ప్రశంసించారు. అతని తరానికి చెందిన “ధైర్యవంతమైన నిర్వాహకుడు” అని అన్నారు. 2019లో మురళీ మందిరాన్ని సందర్శించాలని తన కోరికను వ్యక్తం చేసినప్పటికీ, ఇటీవల బీజేపీలో నుంచి వెళ్లిన సీనియర్ నేత కుమార్తె పద్మజ వేణుగోపాల్ రాజకీయ కారణాలు తనను నిరుత్సాహపరిచారని ఆయన పేర్కొన్నారు. అనంతరం నగరంలోని ప్రముఖ లూర్ద్ మాతా చర్చిని సురేష్ గోపి సందర్శించి ప్రార్థనలు చేశారు. తన కుమార్తె వివాహం సందర్భంగా సెయింట్ మేరీ విగ్రహానికి బంగారు కిరీటాన్ని సమర్పించడాన్ని రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. కిరీటం పసుపు లోహంతో తయారు చేశారని.. రాగితో తయారు చేశారని ఆరోపించారు. కాగా.. గోపీ సురేష్ త్రిసూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొంది కేరళలో బీజేపీ ఖాతా తెరిచారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!