Waqf Issue: కేరళలో వక్ఫ్ బోర్డు వివాదం.. బాధితుల్ని పరామర్శించిన కేంద్రమంత్రి..
- కేరళలో వక్ఫ్ చిచ్చు..
- వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా ఎర్నాకులంలో ఆందోళన..
- తమ భూముల్ని అక్రమంగా క్లెయిమ్ చేసిందని బాధితుల నిరసన..
- బాధితులకు అండగా నిలిచిన కేంద్రమంత్రి సురేష్ గోపి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Issue: కేరళలో ‘వక్ఫ్’ వివాదం రాజుకుంది. తమ భూమిపై వక్ఫ్ బోర్డు క్లెయిమ్‌పై ఎర్నాకులం జిల్లాలోని మునంబం గ్రామంలోని 610 కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి. ఆందోళన చేస్తున్న బాధితులకు కేంద్ర మంత్రి సురేష్ గోపి మద్దతు తెలిపారు. బుధవారం వీరిని కలిసి పరామర్శించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ కుటుంబాలు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తున్న వారి భూమికి రెవెన్యూ హక్కుల్ని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Amaran : ప్రపంచవ్యాప్తంగా 3200థియేటర్లలో రిలీజైన అమరన్
Also Read
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
ఈ వివాదంపై సురేష్ గోపి మాట్లాడుతూ.. నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం నిరసనకారులకు మద్దతు ఇస్తుందని, వారి సమస్యల్ని పరిష్కరిస్తుందని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఉందని, అది ఆమోదం పొంది చట్టంగా మారగానే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వక్ఫ్ ఆక్రమణల్ని పరిష్కరిస్తామన్నారు. 2019లో తన భూముల్ని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసినట్లుగా బాధితులు చెప్పారు. 2022లో వారి ఆస్తులకు భూమి పన్ను చెల్లించలేరని చెప్పారని, కేరళ ప్రభుత్వం కలుగజేసుకుని పన్ను చెల్లించేందుకు అనుమతించిందని చెప్పారు.
అయితే, ఈ చర్యను వక్ఫ్ సంరక్షణ సమితి (వక్ఫ్ రక్షణ కమిటీ) కేరళ హైకోర్టులో సవాలు చేసింది. నిరసన తెలిపిన కుటుంబాలను పన్ను చెల్లించేందుకు అనుమతించాలన్న కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు నిలిపేసింది. బాధితులు చెబుతున్నదాని ప్రకారం.. తమ భూమిని విద్యా అవసరాల కోసం 1950లో సిద్ధిక్ సైత్ అనే వ్యక్తి ఫరూక్ కాలేజీకి ఇచ్చారు. ఇది వక్ఫ్ భూమి కాదని, కళాశాల యాజమాన్య భూమికి తాము డబ్బు చెల్లించామని చెప్పారు. అయితే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణ కోసం బిల్లును ప్రతిపాదించింది. దీనిని చర్చించేందుకు పార్లమెంట్ జాయింట్ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది. ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!