Anupama Parameshwaran : క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, కేంద్రమంత్రి, నటుడు సురేష్ గోపీ కొత్త సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. ఈ సినిమా విషయంలో మొదటి నుంచి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాకే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం నిరాకరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. బోర్డు తీరుపై మలయాళ సినీ పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు బోర్డ్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేసింది. అమ్మ, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ సమక్షంలో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో సినీ, సీరియల్ యాక్టర్సు అందరూ పాల్గొని బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
read also : Kannappa : కన్నప్పపై కుట్రలు ఆపండి.. మంచు విష్ణు వార్నింగ్..
ఈ సినిమాలో అనపమ పేరు జానకి. రామాయణంలో సీతాదేవికి మరో పేరు జానకి. ఆ పేరును ఈ మూవీలో దాడికి గురైన, బాధింపబడ్డ మహిళ పాత్రకు పెట్టడం సరైంది కాదని సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలిపింది. దానిపై మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక సినిమాలో పాత్రకు పేర్లు పెడితే తప్పేంటని ప్రశ్నిస్తోంది. ఇలాంటి వ్యవహారం మంచిది కాదని బోర్డుకు సూచనలు చేస్తోంది. అయినా సరే బోర్డు మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గట్లేదు. దీంతో మలయాళ చిత్ర పరిశ్రమ వర్సెస్ సెన్సార్ బోర్డు అన్నట్టు పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ సినిమా ఓ కోర్టు డ్రామాగా తెరకెక్కించారు. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఇందులో లాయర్ గా సురేష్ గోపీ నటించారు.
read also : Rashmika : ఆ నీచమైన పని చేయను.. రష్మిక షాకింగ్ ఆన్సర్..