యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు . కన్నడ, తమిళ, మలయాళ పరిశ్రమల్లోనూ ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తెలుగు లోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే తన మాతృభాష మలయాళం అయినా, ఎందుకు ఆమె సినిమాలు ఎక్కువగా తెలుగులో వచ్చాయి ? ఇదే ప్రశ్నకు ఆమె ఇటీవల ఇచ్చిన సమాధానం, ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Also Read : Lenin : లెనిన్ మూవీకి డబుల్ అక్కినేని ట్రీట్..!
అనుపమ మాట్లాడుతూ.. ‘తొలినాళ్లలో నన్ను చాలామంది ట్రోల్ చేశారు. నాకు నటనే రాదన్నారు. కానీ ఆ విమర్శలు నాలో కసిని పెంచాయ్. జనానికి నచ్చే సినిమాలే చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అలాంటి సమయంలో తెలుగులో ఆఫర్లు వచ్చాయి. అవి సక్సెస్‌లు కూడా అయ్యాయి. దీంతో అనుకోకుండా తెలుగులో ఎక్కువ సినిమాలు చేశా. అన్ని ట్రోల్స్ వచ్చినా.. నాపై నమ్మకంతో ఇన్నాళ్లకు మళ్లీ ‘జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ వంటి గొప్ప సినిమాకు నన్ను ఎంపిక చేశారు దర్శకుడు ప్రవీణ్ నారాయణ్. నన్ను విమర్శించిన వారందరికీ ఈ సినిమా సమాధానమిస్తుంది. ఈ సందర్భంగా నాకు మద్దతు ఇచ్చిన వారితో పాటు, నన్ను ద్వేషించిన వారికి కూడా కృతజ్ఞతలు.’ అని పేర్కొన్నది అనుపమ పరమేశ్వరన్. కాగా ఈ నెల 27న అనుమప నటించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా కేరళలో విడుదల కానుంది. సురేశ్ గోపీ లాయర్‌గా నటించిన ఈ చిత్రంలో జానకిగా అనుపమ కనిపించనుంది.