మాజీ ప్రధాని ఇందిరాగాంధీని “భారతమాత” అని కేంద్రమంత్రి సురేష్ గోపీ శనివారం వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో.. ఆ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీకి ‘తల్లి’ అని అన్నానని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఈరోజు మీడియాకు తెలిపారు. తాను హృదయపూర్వకంగా మాట్లాడే వ్యక్తినని.. ఇందిరా గాంధీ గురించి తాను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని అన్నారు. ఎవరికీ నచ్చినా, నచ్చకపోయినా… కేరళలో కాంగ్రెస్ పార్టీకి తండ్రి కె. కరుణాకరన్.. భారతదేశంలో కాంగ్రెస్ కు తల్లి ఇందిరాగాంధీ అని అన్నారు.
Read Also: Bakrid Goat Cost : వామ్మో.. ఒక్క గొర్రె రూ.7.5 లక్షలు.. బక్రీద్ ఎఫెక్ట్..
మరోవైపు.. పెట్రోలియం మరియు పర్యాటక శాఖ సహాయ మంత్రి కూడా ఈరోజు ఇందిరా గాంధీపై ప్రశంసలు కురిపించారు. “ఇందిరా గాంధీ స్వాతంత్య్రానంతరం నుంచి ఆమె మరణించే వరకు భారతదేశానికి నిజమైన ఆర్కిటెక్ట్. ఆమె రాజకీయ ప్రత్యర్థి పార్టీకి చెందినది అయినప్పటికీ.. దేశం కోసం నిజాయితీగా పనిచేసిన వ్యక్తిని నేను మరచిపోలేను” అని అన్నారు.
శనివారం త్రిసూర్‌లోని దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్ స్మారకాన్ని కేంద్రమంత్రి సురేష్ గోపీ సందర్శించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. ఆయన మాట్లాడుతూ, ఇందిరా గాంధీని “భారతమాత”, కరుణాకరన్ “ధైర్యవంతమైన నిర్వాహకుడు” అని అభివర్ణించారు. అంతేకాకుండా.. కరుణాకరన్, మార్క్సిస్ట్ అనుభవజ్ఞుడు ఇకె నాయనార్‌లు తన “రాజకీయ గురువులు”గా భావిస్తున్నానని సురేష్ గోపీ చెప్పారు.