Supreme Court: ‘మోడీ ఇంటిపేరు’ వివాదంలో రాహుల్ గాంధీకి శిక్ష విధించిన సూరత్ కోర్టు న్యాయమూర్తితో పాటు గుజరాత్ రాష్ట్రంలో కింది కోర్టుల్లో పనిచేస్తున్న 68 మంది న్యాయమూర్తులకు ప్రమోషన్లు ఇవ్వడంపై స్టే విధించింది. సూరత్ కోర్టు న్యాయమూర్తి హరీష్ హస్ముఖ్ భాయ్ వర్మ కూడా ఇందులో ఉన్నారు. వీరి ప్రమోషన్లు చట్ట వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. హరీష్ హస్ముఖ్ భాయ్ తో సహా 68 మంది న్యాయమూర్తులు జిల్లా జడ్జీ క్యాడర్ కు ప్రమోట్ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ లో గుజరాత్ హైకోర్ట్ సెలక్షన్ జాబితాను జారీ చేసింది.
అయితే ఈ సెలక్షన్ జాబితాను సవాల్ చేస్తూ సివిల్ జడ్జీ క్యాడర్ కు చెందిన ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘మెరిట్ కమ్ సీనియారిటీ’ ఆధారంగా కాకుండా ‘సీనియారిటీ కమ్ మెటిట్’ ఆధారంగా నియమకాలు చేపట్టారని ఆరోపించారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు, గుజరాత్ ప్రభుత్వం, హైకోర్టు రిజిస్టార్ జనరల్ కు నోటీసులు జారీ చేసింది. అయితే కోర్టు నుంచి నోటీసులు వచ్చినప్పటికీ గుజరాత్ ప్రభుత్వం ఆ న్యాయమూర్తులకు ప్రమోషన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Largest Cosmic Explosion: విశ్వంలో అతిపెద్ద పేలుడు.. మాటలకందని విస్పోటనం
అయితే తాజాగా దీనిపై మరోసారి విచారణ జరిగిన సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు కోర్టులో పెండిగ్ లో ఉందని తెలిసి కూడా ప్రభుత్వం వారికి ప్రమోషన్లు ఇవ్వడం దురదృష్టకరమని కోర్టు తెలిపింది. ‘‘కోర్టు నిర్ణయానికి విరుద్ధంగా న్యాయమూర్తులకు ప్రమోషన్లు కల్పించడం చట్టవిరుద్ధం, ఆ ప్రమోషన్ల జాబితాపై స్టే విధిస్తున్నాం. పదోన్నతి పొందిన న్యాయమూర్తులు తిరిగి వారి స్థానాలకు వెళ్లాలి.’’ అని సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ధర్మాసనం తదుపరి విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది.
2019 లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ప్రచారం చేస్తూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మోడీ ఇంటిపేరు ఉన్నవారంతా దొంగలే’’ అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పరువునష్టం కేసు దాఖలు చేశాడు. దీన్ని విచారించిన సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును ఇచ్చింది న్యాయమూర్తి హస్ముఖ్ వర్మనే.