YS Viveka Case: గంగిరెడ్డి బెయిల్ వ్యవహారం.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీజేఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగి రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై అశ్చర్యాన్ని వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్.. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీజేఐ.. బెయిల్ ను రద్దుచేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు.. ఇవి ఎలాంటి ఉత్తర్వులు అంటూ తల పట్టుకున్నారు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. విచారణ వెకేషన్ బెంచ్ కి బదిలీ చేసింది.
Read Also: Anil Kumar Yadav: సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
Also Read
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
ఇక, ఈ వ్యవహారంలో వచ్చేవారం విచారణ జరపనుంది సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్.. అయితే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల్లో షరతును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకా కూతురు వైఎస్ సునీతారెడ్డి.. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ.. వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేసింది. కాగా, గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు జులై 1న మళ్లీ విడుదల చేయాలని సీబీఐ కోర్టుకు ఉత్తర్వులు ఇచ్చింది.. వివేకా హత్య కేసులో జూన్ 30వ తేదీతో దర్యాప్తు ముగించాలని సుప్రీం ఆదేశించినందువల్ల జులై 1న గంగిరెడ్డిని బెయిల్ పై విడుదల చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించింది.. అయితే, జులై 1న మళ్లీ బెయిల్ పై గంగిరెడ్డిని విడుదల చేయాలన్న అంశంపై సుప్రీంను ఆశ్రయించారు సునీతారెడ్డి.. బెయిల్ ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన సందర్భాలున్నాయని, సాక్ష్యులను బెదిరించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని తన పిటిషన్‌లో సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు సునీతారెడ్డి. కాగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కోర్టులో లొంగిపోయిన విషయం విదితమే.. హైదరాబాద్ నాంపల్లిలోని లోని సీబీఐ కోర్టులో లొంగిపోగా ఆయనకు జూన్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు.. ఇక, అంతకుముందు తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయడంతో పాటు 5వ తేదీలోగా లొంగిపోవాలని ఆదేశించింది.. ఇక, వైఎస్ వివేకా హత్య కేసులో 2019 మార్చి 28న పోలీసులు ఎర్ర గంగిరెడ్డిని అరెస్టు చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!