The Kerala Story: సంచలనాలకు కేంద్రబిందువుగా మారిని ‘‘ ది కేరళ స్టోరీ ’’ సినిమాపై స్టే ఇచ్చేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈ సినిమా సెన్సార్ షిప్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను ఈ రోజు విచారించింది. ఇప్పటికే ఈ సినిమాపై సుప్రీంకోర్టు కూడా స్టేకు నిరాకరించింది.
Supreme Court : లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా రెజ్లర్ల ధర్నా కొనసాగుతోంది.
Same Gender Marriage: సెమ్ సెక్స్ మ్యారేజ్ అంశాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. సేమ్ సెక్స్ మ్యారేజ్ అంశంపై కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య వాడీవేడీ వాదనలు జరుగున్నాయి. స్వలింగ వివాహాల విషయంలో ఆ జంటలు తమ హక్కులను కోల్పోతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే LGBTQIA+ కమ్యూనిటీ ఆందోళనల్ని పరిశీలించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు ఈ రోజు తెలిపింది.
Supreme Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన “సిట్” పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.. గత ప్రభుత్వ అవినీతిపై ‘సిట్’ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటుపై ‘స్టే’ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.. హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయగా.. ఇప్పటికే వాదనలు విన్న జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ రోజు తీర్పు ఇచ్చింది.. ఈ సందర్భంగా హైకోర్టు…
The Kerala Story: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ’ సినిమా సంచలనంగా మారుతోంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా చేస్తున్నారు. శుక్రవారం రోజున హిందీ, తెలుగు, తమిళ్, మళయాళం భాషల్లో సినిమా విడుదల కాబోతోంది.
Supreme Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.. గత ప్రభుత్వం (చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం) నిర్ణయాలపై దర్యాప్తు కోసం ‘సిట్’ ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్నేతృత్వంలోని ఏపీ సర్కార్.. అయితే, ‘సిట్’ ఏర్పాటును ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా సవాల్ చేయగా.. సిట్’పై స్టే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఇక, హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది వైఎస్ జగన్…
Death Penalty: ఉరితీసే విధానంపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు ఈ రోజు తెలిపింది. మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం ఉరితీసే విధానం అమలులో ఉంది. అయితే దీన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై చర్చలు జరుగుతున్నాయిన కేంద్రం తరుపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వెల్లడించారు.
Supreme Court: విడాకుల విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. వైవాహిక బంధం కోలుకోలేని విధంగా దెబ్బతింటే ఆర్టికల్ 142 ప్రకారం విడాకులు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది.
Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఎటువంటి ఫిర్యాదు లేకున్నా సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో అలసత్వం వహిస్తే కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపడుతామని హెచ్చరించింది. ప్రసంగం చేసిన వ్యక్తుల మతంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోబడతాయని, దీని ద్వారా భారత రాజ్యాంగంలోని మౌళిక లక్షణం అయిన లౌకికవాదాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.