సోషల్ మీడియాను అందరు వాడేస్తున్నారు.. అయితే ప్రపంచంలో జరిగే వాటిని చూడటం మాత్రమే కాదు.. మనకు నచ్చిన వాటిని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం.. అలాంటి వారికి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.. ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.. ఏదైన పోస్టు పెట్టే ముందు ఆలోచించాలి. పెట్టిన తర్వాత ఆలోచించడం, డిలీట్ చేయడం, సారీ చెప్పడం చేస్తే కుదరదు అని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.. అభ్యంతరకర పోస్టులు పెట్టినప్పుడు దానికి తగ్గ పర్యవసానం కూడా ఎదుర్కోవాల్సిందే…
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన 11 మంది ఖైదీలకు శిక్షాకాలం పూర్తి కాకుండానే క్షమాభిక్ష పేరుతో గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం సుప్రీం కోర్టు విచారణ నిర్వహించింది.
కోర్టుల్లో విచారణ, తీర్పుల సందర్భంలో లింగ వివక్షకు తావు లేకుండా పదాలను వినియోగించడంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండే మూస పదజాలానికి సర్వోన్నత న్యాయస్థానం స్వస్తి పలికింది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గోద్రా రైలు దహనం కేసు దోషులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. గోద్రా అల్లర్లను ‘తీవ్రమైన ఘటన’గా ధర్మాసనం పేర్కొంది. 27 ఫిబ్రవరి 2002న దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది గోద్రా రైలు దహనం ఘటన. ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 59 మంది సజీవ దహనమయ్యారు. అనేక మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అనేక విచారణ కమిటీలను వేశారు. ఈ కేసులో ప్రధాన…
అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించిన మరో కీలక అప్డేట్ వచ్చింది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ భారత బిలీనియర్ గౌతం అదానీ నేతృత్వంలోని కంపెనీలపై అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. అంతేకాకుండా రాజకీయంగా కూడా సంచలనం సృష్టించాయి. హిండెన్‌బర్గ్ సంస్థ ఆరోపణల నేపథ్యంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అదానీ కంపెనీలపై విచారణ చేపట్టింది. ఈ…