Chandrababu Arrest: సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Arrest: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు మరింత హీట్ పెంచుతోంది.. ఇప్పటి వరకు ఏసీబీ కోర్టు, హైకోర్టు వరకే పరిమితమైన ఈ కేసు.. ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చంద్రబాబు.. ఆయన తరపున న్యాయవాదులు ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్ లో ఆయన న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే.
Read Also: Mynampally: మల్కాజ్‌గిరి టికెట్ నాకొద్దు.. పార్టీకే రాజీనామా చేస్తున్న.. మైనం పల్లి లేఖ
Also Read
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నిన్న హైకోర్టుతో పాటు ఏసీబీ కోర్టులోనూ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టు హైకోర్టు న్యాయూర్తి ప్రకటించగా.. మరోవైపు చంద్రబాబు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది.. నిన్న చంద్రబాబు రిమాండ్ పూర్తి కాగా.. రిమాండ్‌ను రెండు రోజుల పాటు పొడిగించిన న్యాయస్థానం.. రెండు రోజుల సీఐడీ కస్టడీకి కూడా అనుమతించింది.. దీంతో.. ఈ రోజు ఉదయమే రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐటీ అధికారులు.. కోర్టు ఆదేశాలను అనుగుణంగా ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబును ప్రశ్నించనున్నారు.. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారు.. ఇక, ప్రతీ గంటకు ఐదు నిమిషాల పాటు ఆయనకు బ్రేక్ ఇస్తు్నారు.. ఈ రోజుతో పాటు రేపు కూడా చంద్రబాబును ప్రశ్నించనున్నారు సీఐడీ అధికారులు.
తాజావార్తలు
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
-
AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
-
Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?