లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అక్టోబర్ 4కు న్యాయస్థానం వాయిదా వేసింది.
Supreme vs ED: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈడీ అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ఈ నెల 26కి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా నోటీసులు ఎలా ఇస్తారని కవిత ఈ పిటిషన్ వేశారు.
Some Convicts Are More Privileged than Others Supreme Court says: గుజరాత్ గోధ్రా అల్లర్ల సమయంలో చోటుచేసుకున్న బిల్కిస్‌బానో సామూహిక అత్యాచారం అప్పట్లో దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. ఆమెను అత్యాచారం చేయడమే కాకుండా, ఆమె కుటుంబంలోని ఏడుగురు వ్యక్తులను కొందరు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నో సంవత్సరాలు న్యాయపోరాటం చేయగా నిందితులకు జీవిత ఖైదు పడింది. అయితే.. రెమిషన్ కింద పదకొండు మందిని గుజరాత్ ప్రభుత్వం గతేడాది జైలు…
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ విచారణ మంగళవారం సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఆరోగ్యకారణాల రీత్యా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత జైన్‌కు మంజూరైన బెయిల్‌ను సెప్టెంబర్ 25 వరకు పొడిగించారు.
గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. డీకే అరుణ తెలంగాణ హైకోర్టును తప్పుదోవ పట్టించారు అని ఆయన ఆరోపించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో తప్పుడు సమాచారం ఇచ్చారు.. హైకోర్టును తప్పుదోవ పట్టించిన డీకే అరుణకు శిక్ష తప్పదు అంటూ ఎమ్మెల్యే అన్నారు.
గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.
ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ కేసులో పిటిషనర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాలలో ఎన్నికల బరిలోకి దిగారు. కానీ, ఆమె బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారంటూ కృష్ణమోహన్‌రెడ్డి ఆరోపించారు.
Article 370: జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూకాశ్మీర్ ని రెండుగా విభజించడంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. తాజాగా ఈ కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
2018లో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మహ్మద్ అక్బర్ లోన్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 'పాకిస్తాన్ జిందాబాద్' అనే నినాదాన్ని లేవనెత్తారు. ఈ పెద్ద వివాదం తర్వాత ఐదేళ్ల తర్వాత, సుప్రీంకోర్టు సోమవారం మహ్మద్ అక్బర్ లోన్‌ను భారత రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేసి, దేశ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.