స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్ తర్వాత పెద్ద పెద్ద లాయర్లతో ఈ కేసును వాదిస్తున్నారు. అయినా.. చంద్రబాబుకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ముందుగా ఏపీ హై కోర్ట్ లో ఈ కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. అయినా చంద్రబాబు తరపున లాయర్లు వెనుకంజ వేయకుండా.. ఓటమిని ఒప్పుకోకుండా సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఒక్కసారి కూడా ఈ కేసును విచారించకుండానే అక్టోబర్ 3వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.
Read Also: Nara Lokesh: సీఐడీ వైసీపీ అనుబంధ విభాగం.. వాళ్ళు వచ్చి లవ్ లెటర్ ఇచ్చారు..
కాగా, ఈ కేసును మంగళవారం రోజున సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇక తాజాగా చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను విచారించే బెంచ్ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ బెంచ్ లో జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి అక్టోబర్ 3వ తారీఖున విచారించనున్న ఈ కేసులో చంద్రబాబుకు ఉపశమనం లభిస్తుందా లేదా హై కోర్ట్ ఇప్పటికే కొట్టేసిన కేసును సుప్రీం కోర్టు కూడా కొట్టేస్తుందా అనేది వేచి చూడాలి.. అయితే, చంద్రబాబు తరపున వాదించే లాయర్లు వాదనను బట్టి ఆధారపడి ఉంటుందన్నది మరికొందరి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.