తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయస్థానాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ప్రకారం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో ఏకంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించింది.
Hydraa Demolition: హైదరాబాద్లోని కొండాపూర్ సర్వే నెంబర్ 59లో వద్ద హైడ్రా కూల్చివేతలకు దిగింది. కొండాపూర్లోని బిక్షపతి నగర్లో ప్రభుత్వ భూమిలో నిర్మించబడిన అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ కూల్చివేతలు భారీ పోలీస్ బందోబస్త్ నడుమ కొనసాగుతుంది. ఇక, మీడియాను కూడా కూల్చివేతల దగ్గరకు అనుమతించకపోగా, రెండు కిలోమీటర్ల దూరంలోనే స్థానికులను, జర్నలిస్టులను పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 25 ఏళ్లుగా ఈ భూమిపై కొనసాగుతున్న వివాదానికి అనుకూలమైన తీర్పును సుప్రీం…
Bihar SIR: వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత, బీహార్ తుది ఓటర్ జాబితా మంగళవారం రిలీజ్ అయింది. భారత ఎన్నికల కమిషన్(ECI) బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు తుది ఓటర్ల జాబితాను ప్రచురించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఓటర్ జాబితా ఆధారంగా నిర్వహించబడుతాయి.
దేశంలోని బార్ కౌన్సిల్ ల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 31 నాటికి ఎన్నికలు జరగని బార్ కౌన్సిల్ ల ఎన్నికలు పూర్తి చేయాలని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ నాయకులను కీర్తించడానికి మీరు ప్రజా నిధులను ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది.
వైబ్రంట్ విజయవాడ ఉత్సవాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. బెజవాడ దుర్గ గుడి భూముల్లో వైబ్రెంట్ విజయవాడ ఉత్సవ్ పేరుతో వాణిజ్య కార్యకలాపాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు..
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక రిపోర్టుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం కూలిపోయింది. దాదాపు 271 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ప్రమాదంపై రెండు సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.
సుప్రీం ధర్మాసనం..‘‘ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వ్యాజ్యం. వెళ్లి దేవుడినే ఏదైనా చేసుకోమని అడగండి. మీరు విష్ణువు భక్తులని మీరు అనుకుంటే, మీరు ప్రార్థన చేసి, కొంత ధ్యానం చేయండి’’ అని సీజేఐ అన్నారు. ఈ ఆలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికార పరిధి కిందకు వస్తుందని పేర్కొంటూ పిటిషన్ను తోసిపుచ్చింది.
UP: ఉత్తర్ ప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడి బీజేపీ ప్రభుత్వం మాఫియా, ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, నేరస్తులకు వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే, పలువురు గ్యాంగ్స్టర్లు పోలీస్ ఎన్కౌంటర్లలో హతమయ్యారు. నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితికి తీసుకువచ్చారు యోగి. అయితే, ఇప్పుడు యోగి ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం సంచలనంగా మారింది. కుక్కలు కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగిసే కటకటాల్లో పెడతామంటూ కొత్త నిబంధనల్ని ప్రకటించింది.
CJI BR Gavai: ఖజురహోలోని విష్ణు విగ్రహానికి సంబంధించిన పిటిషన్ను విచారిస్తున్న సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రాజేశాయి. ఖజురహోలోని పురాతన విష్ణువు విగ్రహం ధ్వంసం చేయబడిందని, దీనిని మళ్లీ తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ, సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయబడింది. ఖజురహోలో ఏడు అడుగుల ఎత్తైన విష్ణువు విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలపై…