Supreme Court: పైలట్లను నిందించొద్దు.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కీలక సూచన
- పైలట్లను నిందించొద్దు
- అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు కీలక సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత పైలట్లపై అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మీడియాలో లేనిపోని కథనాలు ప్రచురించాయి. పైలట్ ఆత్మహత్య కారణంగానే ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగిందంటూ కథనాలు ప్రచురించాయి. అయితే కథనాలను పైలట్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
ఇది కూడా చదవండి: PM Modi: వందేమాతరం ఒక శక్తి.. నవంబర్ 7 చారిత్రాత్మక రోజు అన్న మోడీ
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
తాజాగా ఇదే అంశంపై పైలట్ సుమీత్ సబర్వాల్ తండ్రి పుష్కర్ సబర్వాల్(91) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని.. తన కొడుకుపై వస్తున్న నిందలు ఈ వయసులో తట్టుకోలేకపోతున్నట్లు పిటిషన్‌లో వాపోయాడు. శుక్రవారం పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. నివేదిక రాకుండా పైలట్‌ను ఎలా నిందిస్తారని తప్పుపట్టింది. వృద్ధ వయసులో ఈ భారాన్ని మోయొద్దని.. ఇందులో మీ కుమారుడు తప్పు లేదని న్యాయస్థానం సూచించింది. తుది నివేదిక వచ్చేంత వరకు పైలట్‌ను ఎవరూ నిందించొద్దని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Supreme Court: వీధి కుక్కల బెడదపై మరోసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని.. మీ కొడుకును నిందించే భారాన్ని మీరు మోయకూడదని.. వృద్ధ పిటిషనర్‌కు జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసింది. ప్రాథమిక రిపోర్టులో ఇద్దరు పైలట్ల సంభాషణ మాత్రమే రికార్డైంది. దానిని బట్టి ఎవరినీ నిందించొద్దని జస్టిస్ బాగ్చి అన్నారు. పత్రికల్లో వచ్చే ఆరోపణలను పట్టించుకోవద్దని.. ఒకవేళ దావా వేయాలంటే వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికపై వేయాలని సూచించారు. ఈ విషాదానికి కారణం ఏదైనా కావచ్చు.. కానీ పైలట్ కారణం కాదని జస్టిస్ సూర్యకాంత్ పిటిషనర్‌తో అన్నారు. తదుపరి విచారణ నవంబర్ 10కు ధర్మాసనం వాయిదా వేసింది.
జూన్ 13న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు ఎయిరిండియా బయల్దేంది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే సమీపంలో ఉన్న మెడికోల హాస్టల్‌పై కూలిపోయింది. దీంతో విమానంలో ఉన్న ఒక్కరు తప్ప.. అందరూ చనిపోయారు. అలాగే హాస్టల్‌లో ఉన్న పలువురు మెడికోలు కూడా మృతిచెందారు. ఇలా మొత్తంగా 270 మంది చనిపోయారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎయిరిండియా నష్టపరిహారం ప్రకటించింది. అయితే ఈ ప్రమాదంపై రెండు దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. ఇంతలోనే అంతర్జాతీయ మీడియా తప్పుడు కథనాలు ప్రచురించింది. పైలట్ ఆత్మహత్య వల్లే ప్రమాదం జరిగిందంటూ కథనాలు ప్రచురించాయి. ఈ కథనాలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక తుది నివేదిక ఈ ఏడాది చివరి నాటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!