సుప్రీం ధర్మాసనం..‘‘ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వ్యాజ్యం. వెళ్లి దేవుడినే ఏదైనా చేసుకోమని అడగండి. మీరు విష్ణువు భక్తులని మీరు అనుకుంటే, మీరు ప్రార్థన చేసి, కొంత ధ్యానం చేయండి’’ అని సీజేఐ అన్నారు. ఈ ఆలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికార పరిధి కిందకు వస్తుందని పేర్కొంటూ పిటిషన్ను తోసిపుచ్చింది.
UP: ఉత్తర్ ప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడి బీజేపీ ప్రభుత్వం మాఫియా, ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, నేరస్తులకు వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే, పలువురు గ్యాంగ్స్టర్లు పోలీస్ ఎన్కౌంటర్లలో హతమయ్యారు. నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితికి తీసుకువచ్చారు యోగి. అయితే, ఇప్పుడు యోగి ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం సంచలనంగా మారింది. కుక్కలు కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగిసే కటకటాల్లో పెడతామంటూ కొత్త నిబంధనల్ని ప్రకటించింది.
CJI BR Gavai: ఖజురహోలోని విష్ణు విగ్రహానికి సంబంధించిన పిటిషన్ను విచారిస్తున్న సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రాజేశాయి. ఖజురహోలోని పురాతన విష్ణువు విగ్రహం ధ్వంసం చేయబడిందని, దీనిని మళ్లీ తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ, సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయబడింది. ఖజురహోలో ఏడు అడుగుల ఎత్తైన విష్ణువు విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలపై…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీతా రెడ్డి.. కేసులో మరింత విచారణ జరపాలి, కేసుతో సంబంధం ఉన్న కొందరి బెయిల్లను కూడా రద్దు చేయాలని వైఎస్ వివేకా కూతురు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
Waqf (Amendment) Act: వక్ఫ్(సవరణ)చట్టం-2025పై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 15 తీర్పు వెల్లడించనుంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ స్టే కోరుతూ దాఖలపై పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం తన మధ్యంతర ఉత్తర్వులను ప్రకటిస్తుంది. మూడు ప్రధాన అంశాలపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తుంది. వీటిలో ‘‘వక్ఫ్ బై యూజర్’’, వక్ఫ్ బై కోర్ట్ ద్వారా వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం కూడా ఉంది. మూడు రోజలు పాటు రెండు వైపులా వాదనలు విన్న తర్వాత…
PM Modi: వీధికుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ‘‘జంతు ప్రేమికుల’’ నుంచి పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. ఈ చర్చ జరుగుతున్న సమయంలో, ప్రధాని నరేంద్ర మోడీ ‘‘యానివల్ లవర్స్’’పై సెటైర్లు వేశారు. కేవలం ఒకే లైన్తో వారి కపటత్వాన్ని ఎత్తిచూపారు. శుక్రవారం విజ్ఞాన్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. జంతుప్రేమికులతో ఇటీవల తన సమావేశం గురించి వ్యాఖ్యానించారు.
పొరుగువారితో గొడవ, గొడవ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన కేసులో ఆదేశాన్ని జారీ చేసింది. సుప్రీంకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని రద్దు చేసింది. ఐపిసి సెక్షన్ 306 కింద కేసు నమోదు చేయడానికి అవసరమైన షరతులను కూడా వివరించింది. పొరుగువారి మధ్య వివాదాలు తీవ్ర వాదనలు, శారీరక ఘర్షణలకు దారితీస్తే, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించబడదని సుప్రీంకోర్టు పేర్కొంది. పొరుగువారిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణపై…
Aadhaar card: భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఆధార్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్గా పరిగణించాల్సిందేనని ఎన్నికల కమిషన్కు ఆదేశించింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఎన్నికల సమయంలో తమ గుర్తింపు సులభంగా నిరూపించుకునే అవకాశం కలగబోతుంది. సుప్రీంకోర్టు ఈ ఆదేశాన్ని ఇవ్వడానికి గల ముఖ్య కారణం.. ప్రస్తుతం ఆధార్ కార్డు దేశంలో అత్యంత నమ్మదగిన గుర్తింపు పత్రంగా ఉండడమే. ప్రభుత్వానికి, ప్రజలకు అనేక సేవలు అందించడంలో ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది. కానీ, ఇప్పటివరకు ఎన్నికల సమయంలో…