బీసీ రిజర్వేషన్లను తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుంది అనే నమ్మకం మాకు ఉందన్నారు.
BC Reservations: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చింది.
BC Reservations: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు పాస్ అయ్యాక, ఉత్తర్వులు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు స్థానిక ఎన్నికలపై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్‌రెడ్డి సెప్టెంబరు 29న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి…
తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయస్థానాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ప్రకారం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో ఏకంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించింది.
Hydraa Demolition: హైదరాబాద్‌లోని కొండాపూర్ సర్వే నెంబర్ 59లో వద్ద హైడ్రా కూల్చివేతలకు దిగింది. కొండాపూర్‌లోని బిక్షపతి నగర్లో ప్రభుత్వ భూమిలో నిర్మించబడిన అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ కూల్చివేతలు భారీ పోలీస్ బందోబస్త్ నడుమ కొనసాగుతుంది. ఇక, మీడియాను కూడా కూల్చివేతల దగ్గరకు అనుమతించకపోగా, రెండు కిలోమీటర్ల దూరంలోనే స్థానికులను, జర్నలిస్టులను పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 25 ఏళ్లుగా ఈ భూమిపై కొనసాగుతున్న వివాదానికి అనుకూలమైన తీర్పును సుప్రీం…
Bihar SIR: వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత, బీహార్ తుది ఓటర్ జాబితా మంగళవారం రిలీజ్ అయింది. భారత ఎన్నికల కమిషన్(ECI) బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు తుది ఓటర్ల జాబితాను ప్రచురించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఓటర్ జాబితా ఆధారంగా నిర్వహించబడుతాయి.
దేశంలోని బార్ కౌన్సిల్ ల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 31 నాటికి ఎన్నికలు జరగని బార్ కౌన్సిల్ ల ఎన్నికలు పూర్తి చేయాలని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ నాయకులను కీర్తించడానికి మీరు ప్రజా నిధులను ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది.
వైబ్రంట్ విజయవాడ ఉత్సవాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. బెజవాడ దుర్గ గుడి భూముల్లో వైబ్రెంట్ విజయవాడ ఉత్సవ్ పేరుతో వాణిజ్య కార్యకలాపాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు..
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక రిపోర్టుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం కూలిపోయింది. దాదాపు 271 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ప్రమాదంపై రెండు సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.