న్యాయవాదులకు దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇవ్వడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. దర్యాప్తు సంస్థలు న్యాయవాదులకు సమన్లు జారీ చేయకూడదని సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది.
Justice Surya Kant: భారతదేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. నవంబర్ 24న ఆయన సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ స్థానంలో ఆయన అత్యున్నత న్యాయ పదవికి నియమితులయ్యారు. న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సూర్యకాంత్ నియామకాన్ని ధ్రువీకరించారు. “భారత రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను నవంబర్ 24 నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి రాష్ట్రపతి…
వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వీధి కుక్కల సమస్యపై అఫిడవిట్ దాఖలు చేయని రాష్ట్రాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
Justice Surya Kant: భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవై ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నెలల తర్వాత, ఆయన వారసుడిని నియమించే ప్రక్రియ ప్రారంభమైంది. తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజేఐ గవాయ్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 23తో ముగుస్తోంది. రేపటిలోగా తన వారసుడిని సిఫారసు చేయమని కోరుతూ ప్రభుత్వం గవాయ్‌కి లేఖ రాసినట్లు సమాచారం. గవాయ్ నవంబర్ 23, 2025న పదవీ…
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లండని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో జరుగనున్నకేబినెట్ భేటీలో…
Supreme court: ‘‘ఉరితీయడం’’ ద్వారా మరణశిక్ష విధించడంపై సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. ఉరికి బదులుగా, ప్రాణాంతక ఇంజెక్షన్ల ద్వారా మరణశిక్ష విధించడానికి కేంద్రం ఇష్టం చూపడం లేదని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, ఉరికి బదులుగా వేరే విధంగా మరణశిక్ష విధించేందుకు సిద్ధంగా లేదు అని చెప్పింది.
BC Reservation Case: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9 పై స్టే విధించింది రాష్ట్ర హైకోర్టు.. అయితే, హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర సర్కార్.. ఈ మేరకు సోమవారం దాదాపు 50 పేజీలకుపైగా సమగ్రమైన సమాచారంతో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పులోని అంశాలపై కూలంకషంగా చర్చించిన తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది..అయితే, 42 శాతం బీసీ రిజర్వేషన్ పై…
Supreme Court: వైవాహిక వివాద కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భార్య,భర్తను తన చుట్టూ తిప్పించుకోకూడదు’’ అని వ్యాఖ్యానించింది. భార్యాభర్తలు ఇద్దరు తన పిల్లల కోసం ఈగోలను పక్కన పెట్టాలని కోరింది. న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పిల్లల సంక్షేమానికి తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. మధ్యవర్తిత్వం ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది.
Teacher Eligibility Test: దేశవ్యాప్తంగా 6–14 సంవత్సరాల పిల్లలకు విద్యనందిస్తున్న అన్ని పాఠశాలల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) పరిధికి రిఫర్ చేసింది. దేశంలోని అన్ని విద్యాసంస్థల్లో టెట్ పూర్తి చేసిన వాళ్లే ఉపాధ్యాయులుగా ఉండాలని, ఏ విద్యా సంస్థకు మినహాయింపు ఇవ్వొద్దని సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న లా స్టూడెంట్ నితిన్ ఉపాధ్యాయ్ సుప్రీం కోర్టును…
హీరా గ్రూప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ నౌహెరాషేక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో కేసు నమోదైందంటేనే ఎంతో మంది వ్యాపారవేత్తలు భయపడిపోతారు. కానీ నౌహెరా షేక్ మాత్రం.. ఈడీ అధికారులతో చెలగాటం ఆడుతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం, అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేయడానికి ప్రయత్నిస్తే.. వేలంలో వేసిన వారినే బెదిరింపులకు దిగుతోంది. అంతే కాదు ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో కొన్నిటిని, అధికారులకే తెలియకుండా విక్రయిస్తోంది. Also Read:Premanand Maharaj:…