Digvijaya Singh: ‘‘ఉమర్ ఖలీద్ అమాయకుడు’’.. దిగ్విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం..
- ‘‘ఉమర్ ఖలీద్ అమాయకుడు’’..
- ఢిల్లీ అల్లర్ల నిందితుడిపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- దిగ్విజయ్ సింగ్ కామెంట్స్‌పై బీజేపీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digvijaya Singh: 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ గురించి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఉమర్ ఖలీద్ ‘‘నిర్దోషి, అమాయకుడు’’ అంటూ ఆయన అనడం కొత్త వివాదాన్ని రేపింది. జాతీయ భద్రతలకు ఆందోళన కలిగించే తీవ్రమైన కేసుల్లో ఉన్న వ్యక్తి పట్ల దిగ్విజయ్ సింగ్ సానుభూతి చూపిస్తున్నారంటూ బీజేపీ ఎదురుదాడి చేసింది. దిగ్విజయ్ సింగ్ తన సోషల్ మీడియా పోస్టులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఖలీద్ ఐదేళ్లుగా నిర్బంధంలో ఉన్నప్పటికీ న్యాయం దక్కడం లేదని ఆయన అన్నారు.
‘‘ఉమర్ ఖలీద్ చరిత్రలో డాక్టరేట్ పొందారు. ఆయన ఉన్నత విద్యావంతుడు, సున్నితమైన వ్యక్తి. ఆయనపై ఎలాంటి నేరాలు ఆరోపించబడినా దర్యాప్తు చేసి పరిష్కరించాలి. ఆయన ఐదున్నర సంవత్సరాలుగా జైలులో ఉన్నారు. ఆయనపై ఎటువంటి అభియోగాలు నిరూపించబడలేదు. సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ బెయిల్ ఒక హక్కు అని చెబుతుంది; జైలు ఒక మినహాయింపు. కానీ ఇక్కడ, ఆయనకు ఈ హక్కు ఎక్కడ మంజూరు చేయబడింది? ఆయన విచారణలు కొనసాగుతున్నప్పుడు, న్యాయమూర్తులు నిరంతరం తేదీలను వాయిదా వేస్తారు. తేదీ నిన్నటిది, కానీ అది వాయిదా పడింది. నేడు అధికారంలో ఉన్నవారు అలాంటి నిర్ణయాలను ప్రభావితం చేస్తారు. దీని కారణంగా, ఆయనకు అర్హత ఉన్న వాటిని కూడా పొందడం లేదు.’’ అని అన్నారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
జేఎన్‌యూ స్టూడెంట్ అయిన ఉమర్ ఖలీద్ ను UAPA చట్టం కింద అరెస్ట్ చేశారు. 2020లో జరిగి ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఈ హింసలో 50 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. అశాంతిని రెచ్చగొట్టడానికి, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన కుట్రలో భాగమని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు.
దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ మాట్లాడుతూ.. ఆయనకు తీవ్రవాదులతో సానుభూతి చూపే చరిత్ర ఉందని ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్ భారత్‌లో జన్మించి ఉండకపోవచ్చనే అనుమానం ప్రారంభమైందని, కొన్నిసార్లు ఉగ్రవాది ఒసామాను, ఒసామా జీ గా సంబోధిస్తారని, అప్జల్ గురును , అప్జల్ గురు జీగా పిలుస్తారని అన్నారు. వీలైనంత త్వరగా దిగ్విజయ్ సింగ్ పాకిస్తాన్‌లో ఒక శిబిరం ఏర్పాటు చేయాలని అన్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!