ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం, 2025 అమల్లోకి వచ్చింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 8 నుంచే ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఈ బిల్లు పాస్ అవ్వగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్ (సవరణ) బిల్లు చట్టంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం గెజిట్…
వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చాక పశ్చిమ బెంగాల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తీవ్ర స్థాయిలో హింస చెలరేగింది. ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, మాల్డా, హుగ్లీతో సహా ఇతర జిల్లాల్లో హింస చెలరేగింది.
KTR: తెలంగాణ భవన్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ వ్యక్తిత్వం, నాయకత్వం, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను కొనియాడారు. అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ తీసుకున్న కీలక నిర్ణయాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేటీఆర్ తెలిపారు. ఆయన ఆలోచన నాయకత్వం వల్లే మనకు ఈరోజు తెలంగాణ లభించింది. అంబేద్కర్ కారణంగానే మనకు అత్యుత్తమ రాజ్యాంగం లభించిందని…
Waqf Act: ఈ రోజు నుంచి వక్ఫ్ సవరణ చట్టం-2025 అమలులోకి వచ్చింది. గత వారం పార్లమెంట్ వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు (ఏప్రిల్ 8, 2025) నుంచి అమలులోకి వచ్చినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది.
Supreme Court: మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ ఉపశమనం కలిగించింది. 2022లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) రిక్రూట్మెంట్ కోసం సూపర్‌న్యూమరీ లేదా అదనపు పోస్టుల సృష్టిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలన్న కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు (ఏప్రిల్ 8న) రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్.రవికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10కిపైగా బిల్లులను నిలిపివేయడంపై తీవ్రంగా తప్పుపట్టింది. ఈ చర్య చట్ట విరుద్ధం అంటూ సుప్రీం ధర్మాసనం చీవాట్లు పెట్టింది.
Waqf Act: వక్ఫ్ సవరణ చట్టం-2025ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌కి చెందిన ఎంపీ మొహమ్మద్ జావెద్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలు పిటిషన్లు దాఖలు చేయగా, పలు పార్టీలు కూడా పిటిషన్లు వేస్తున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు విన్న తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది.. నేను మాట్లాడిన తీరుపై తనను జైలులో వేసే ఛాన్స్ ఉంది.. ఎవరైనా తనకు సవాల్ విసిరితే.. దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాటకు నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాను అన్నారు.. అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు చేజారకుండా చూస్తానని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ఇక, ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది..