సుప్రీంకోర్టు తీర్పు విన్న తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది.. నేను మాట్లాడిన తీరుపై తనను జైలులో వేసే ఛాన్స్ ఉంది.. ఎవరైనా తనకు సవాల్ విసిరితే.. దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాటకు నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాను అన్నారు.. అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు చేజారకుండా చూస్తానని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ఇక, ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది..
KTR: తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులకు కేటీఆర్ బహిరంగ లేఖ రాసారు. ఇక ఇందులో తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కొత్త సమస్యలు సంభవిస్తున్నాయని.. ఈ తరుణంలో రాష్ట్ర ఆర్థిక లాభాలను పరిగణలోకి తీసుకుని పర్యావరణంపై దాడులు జరగడం చాలా దారుణ పరిస్థితిని సృష్టిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా 400 ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడడంతో పాటు 734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు మరియు 10 క్షీరదాల జీవ ఆవాసంని నాశనం చేసే…
Asaduddin Owaisi: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు-2025 పార్లమెంట్లో పాస్ అయింది. కాంగ్రెస్, ఎస్పీ వంటి ఇండీ కూటమి పార్టీలు లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయి. అయినప్పటికీ బీజేపీ కూటమికి సంఖ్యా బలం ఉండటంతో బిల్లు రెండు సభల్లో సులభంగా నెగ్గింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ మొహహ్మద్ జావెద్ బిల్లును వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. Read…
Supreme Court: 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించాలనే పిటిషన్‌ని ఈ రోజు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ని విచారించేందుకు నో చెప్పింది. ఇది విధానపరమైన విషయమని, మీరు పార్లమెంట్ చట్టం చేయాలని అడగాలని ధర్మాసనం పిటిషనర్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. జస్టిన్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం, దీనిపై సంబంధిత అధికార యంత్రాంగానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి స్వేచ్ఛని ఇచ్చింది.
Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టంగా మారడమే మిగిలింది. ఈ బిల్లు ముస్లింలకు మేలు చేకూరస్తుందని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే చెబుతుండగా, ఇది ముస్లింల హక్కుల్ని కాలరాస్తుందని కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావేద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టులో గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసుపై విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్ ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. హత్యకు గురయ్యే ముందు వామన్ రావు మాట్లాడిన వీడియోలో పుట్ట మధు పేరు ఉందా లేదా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి పరిశీలన తర్వాతే…
వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఇక బిల్లు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపితే చట్టంగా మారనుంది. బిల్లు చట్టంగా మారకముందే సుప్రీంకోర్టు తలుపులు తట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.