Supreme Court: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13వ తేదీన పదవీ విరమణ చేశారు. అయితే, జస్టిస్ సంజీవ్ ఖన్నా కేవలం ఆరు నెలలు మాత్రమే సేవలందించారు. నిన్నటితో ఆయన పదవీ కాలం ముగిసింది. దీంతో భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
Read Also: Security Cabinet Meeting: నేడు మరోసారి సీసీఎస్ కేబినెట్ భేటీ.. భద్రతా వ్యవహారాలపై చర్చ!
కాగా, సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును సీజేఐ సంజీవ్ ఖన్నా ఏప్రిల్ 16వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చిన జస్టిస్ గవాయ్ సీజేఐగా ఆరు నెలలకుపైగా కొనసాగనున్నారు. 2025 నవంబర్ 23వ తేదీన ఆయన పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కావడం విశేషం.
Read Also: KanKhajura: సోనీ లివ్‌లో మే 30 నుంచి ‘కన్‌ఖజురా’ స్ట్రీమింగ్
అయితే, జస్టిస్ బీఆర్ గవాయ్ పూర్తిపేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985 మార్చి 16న బార్ కౌన్సిల్ లో సభ్యుడిగా చేరారు. 2003 నవంబర్ 14వ తేదీన బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12న అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. అనేక చారిత్రాత్మక తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టుకు చెందిన పలు రాజ్యాంగ ధర్మాసనాలలో జస్టిస్ గవాయ్ భాగమయ్యారు. ఆర్టికల్ 370 రద్దు, ఎన్నికల బాండ్ల రద్దు వంటివి చేసిన మరో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ బీఆర్ గవాయ్ సభ్యుడిగా ఉన్నారు.