Supreme Court: 1995 చట్టంలోని ఏవైనా నిబంధనలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన ఏ పిటిషన్‌ని కూడా స్వీకరించబోమని, వక్ఫ్ సవరణ చట్టం-2025 అమలును తాత్కాలికంగా నిలుపుదల కోరుతూ నమోదైన పిటిషన్లను పరిగణలోకి తీసుకునే అంశంపై మే 20న నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవై నేతృత్వంలోని డివిజన్ బెంచ్, చట్టంలోని మూడు వివాదాస్పద అంశాలపై మధ్యంతర ఉత్తర్వు అవసరమా..? కాదా..? అనే విషయాన్ని నిర్ణయిస్తుంది.
Read Also: Shhyamali De: సమంత రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ భార్య ఎవరో తెలుసా?
వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ కౌన్సిల్, బోర్డులో ముస్లిమేతరులను నామినేట్ చేయడం, వక్ఫ్ కింద ప్రభుత్వ భూముల్ని గుర్తించడం వంటి వాటిపై పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, వీటిని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు సుప్రీంకోర్టుని కోరారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని సవాల్ చేస్తున్న పిటిషన్ల తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తున్నారు. కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తున్నారు. సోమవారం ఉదయం నాటికి తన రాతపూర్వక నోట్‌ని సమర్పించాలని తుషార్ మెహతాని సుప్రీం ధర్మాసనం కోరింది.
కోర్టు తీర్పు ఇచ్చే వరకు కొత్త చట్టం ప్రకారం కేంద్రం ఏ వక్ఫ్‌ను డీ-నోటిఫై చేయడానికి, వక్ఫ్ బై యూజర్, ముస్లిమేతరులను వక్ఫ్ కౌన్సిల్‌లో చేర్చడం వంటి వాటిపై చర్యలు తీసుకోదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి హామీ ఇచ్చారు.