జాతీయ వైద్య విద్యా ప్రవేశాల పరీక్ష (నీట్)ను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది సుప్రీంకోర్టు.. దీంతో.. నీట్ యథాతథంగా నిర్వహించనున్నారు.. కాగా, సెప్టెంబరు 12న నీట్ నిర్వహణకు ఇప్పటికే ప్రకటన విడుదల కాగా.. అదేరోజు మరికొన్ని పోటీ పరీక్షలు ఉన్నాయని, సీబీఎస్ఈ పరీక్షలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టును ఆశ్రయించారు కొందరు.. నీట్ వాయిదా వేయాలని, మరో తేదీ ప్రకటించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు విన్నవించారు.. అయితే, నీట్ యథాతథంగా సెప్టెంబరు 12నే జరుగుతుందని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం… దేశవ్యాప్తంగా 16 లక్షల మంది నీట్ రాస్తున్నారన్న కోర్టు.. విద్యావ్యవస్థలపై మేం జోక్యం చేసుకుంటే ఆ ప్రభావం లక్షల మందిపై పడుతుందని వ్యాఖ్యానించింది.. అయినా నీట్ వాయిదా వేయడం సబబు కాదని.. ఆ పిటిషన్లను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది.. ఏదో ఒక పరీక్ష ఎంచుకోవాలంటూ సూచనలు చేసింది.