ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనంపై రేపే క్లారిటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనంపై ఉత్కంఠ కొనసాగుతోంది.. అయితే, హైదరాబాద్ వినాయక నిమజ్జనంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో.. జీహెచ్‌ఎంసీ.. సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. ఈ ఏడాది నిమజ్జనాలకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ అప్పీల్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు.. రేపు విచారణ చేపట్టనుంది.
నిమజ్జనం నిబంధనలకు సంబంధించి తీర్పును పునఃసమీక్షించలేమని.. హైకోర్టు తేల్చి చెప్పడంతో సిటీలోని భారీ గణనాథుల నిమిజ్జనంపై సందిగ్ధం ఏర్పడింది. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాన్ని ఈనెల 19న నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించారు. పోలీసులు కూడా అందుకు అనుగుణంగానే ప్రణాళికను సిద్ధం చేశారు. మట్టిగణపతులపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో.. వాటి నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు ప్రారంభించింది. పది అడుగుల కంటే చిన్న విగ్రహాలను మినీ పాండ్స్‌లో నిమజ్జనం చేస్తున్నారు. పది అడుగులకు మించి ఎత్తున్న విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేసేలా భారీ క్రేన్లను ఏర్పాటు చేసింది. నగరంలోని చెరువుల వద్ద ఇప్పటికే నిర్మించిన మినీపాండ్స్ దగ్గర నిమజ్జనాలు జరుగుతున్నాయి. పెద్ద సైజు విగ్రహాల కోసం క్రేన్లను అందుబాటులో ఉంచారు. మరోవైపు నిమజ్జనంపై సుప్రీంకోర్టులో కూడా తీర్పు అనుకూలంగా రాకపోతే.. ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని గణేష్ ఉత్సవ సమితి కోరుతోంది.
Also Read
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!