కేసు వదిలేదే లే.. శ్యామ్ కె నాయుడుకు నటి సుధ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి అయిన శ్రీసుధతో ఐదేళ్లు సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన విషయం తెల్సిందే. తనకు న్యాయం చేయాలంటూ సుధ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయం విదితమే. ఇక ఈ కేసులో శ్యామ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. అతడి నుంచి తనకు ప్రాణ హాని ఉందని, తనకు బెయిల్ ఇస్తే తనను చంపేస్తారని తెలుపుతూ సుధ సుప్రీం కోర్టులో పిటిషన్ పెట్టగా.. తాజాగా సుప్రీం కోర్టు ఆ పిటిషన్ ని కొట్టి పడేసింది. దీంతో శ్యామ్ కి బెయిల్ మంజూరు అయ్యింది.
ఇక ఈ విషయంపై నటి సుధ పేస్ బుక్ ద్వారా స్పందించింది. ” నేను ఎదుర్కోవడానికి రెడీ గా ఉన్నాను.. ఈ కేసును వదిలేది లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. గత మూడేళ్ళ నుంచి ఈ కేసు నడుస్తోంది. శ్యామ్ కె నాయుడు తనను చిత్ర హింసలు పెట్టి, తనను చంపాలని చూస్తున్నాడని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు తనను లైంగికంగా వేధించినట్లు సుధ తెలిపారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకోనుందో ముందు ముందు చూడాలి.
Also Read
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
- S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
- Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్‌లో కింగ్ రైటింగ్!
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!