Supreme Court: వైవాహిక వివాద కేసులో జీవిత భాగస్వామి టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డ్ చేయడం ఆమోదయోగ్యమైన సాక్ష్యమని సుప్రీంకోర్టు సోమవారం ఓ కేసులో తీర్పు చెప్పింది. జీవిత భాగస్వామి టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘిస్తుందని, కుటుంబ కోర్టులో సాక్ష్యంగా అంగీకరించలేమని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పున సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.
యెమెన్‌లో భారత సంతతికి చెందిన కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షపై కేంద్రం చేతులెత్తేసింది. ఉరిశిక్షను నిలిపివేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని.. దౌత్యపరంగా చేపట్టాల్సిన అన్ని అయిపోయాయని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడే విధంగా వ్యవహారిస్తోందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల నిబంధనల విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు గతంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు త్వరలోనే మరి కొందరు కొత్త జడ్జీలు రానున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా తుహిన్ కుమార్ పేరు సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం.. తెలంగాణ హైకోర్టుకు నలుగురు జడ్జీల నియామకానికి సిఫార్సు చేసింది..
సుప్రీంకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది.
SC-ST reservation: చరిత్రలో మొదటిసారిగా, భారత సుప్రీంకోర్టు, తన సిబ్బంది నియామకాలు, ప్రమోషన్ల విషయంలో ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్ విధానాన్ని అధికారికంగా అమలు చేసింది. జూన్ 24, 2025 నాటి ఇంటర్నల్ సర్క్యులర్ ద్వారా ఈ విధానాన్ని అమలు చేస్తు్న్నట్లు ప్రకటించింది. ఇది దేశ అత్యున్నత న్యాయ సంస్థలో నియామకాలు, ప్రాతినిధ్యానికి ఒక ముఖ్యమైన అడుగుగా చూస్తున్నారు.
వరకట్నం కోసం భార్యను హత్య చేశాడు ఓ భర్త.. కేసు సుప్రీంకోర్టుకు చేరుకుంది. కోర్టులో ఆ భర్త విచిత్ర కోరిక కోరాడు. ఎంతటి వ్యక్తులకైనా చట్టం ఒక్కటే అని తెలియదేమే విచిత్ర కోరిక కోరాడు. తాను ‘ఆపరేషన్ సిందూర్’లో పని చేశానని.. ఈ కేసులో మినహాయింపు కల్పించాలని ఆ కమాండో సుప్రీంకోర్టును కోరాడు.
Supreme Court : ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నంత మాత్రాన మీకు మేం కేసు నుంచి రక్షణ కల్పించలేం అని సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. వరకట్నం కోసం భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఓ ఎన్ఎస్జీ కమాండో వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పంజాబ్ కు చెందిన ఓ వ్యక్తి నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌లోని బ్లాక్ క్యాట్ కమాండో యూనిట్లో పనిచేస్తున్నాడు. అతను వరకట్నం కోసం భార్యను చంపేశాడనే…
Thug Life: కమల్ హాసన్ కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ కర్ణాటకలో తప్పనిసరిగా విడుదల చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. విడుదలపై బెదిరింపులు రావడంపై కర్ణాటక సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదలకు వ్యతిరేకంగా బెదిరించే వారిపై చర్యలు తీసుకోవడం మీ కర్తవ్యం అని పేర్కొంది.