Tellam Venkatrao : ఢిల్లీ – బంజారా, లంబాడా, సుగాళీలను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, మాజీ ఎంపీ సోయం బాపురావు, మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్ అల్లంకి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. బంజారా, లంబాడాలు, సుగాళీలు గిరిజనులు కారని, 1976 వరకు ఉమ్మడి ఏపీలోని తెలంగాణ జిల్లాల్లో వారిని ఎస్టీలుగా పరిగణించలేదని, ఇతర రాష్ట్రాల నుంచి వారు తెలంగాణకు వచ్చి, అప్పటి నుంచి గిరిజనుల హక్కులను కొల్లగొడుతున్నారని పిటిషనర్లు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. వాస్తవానికి మొదట బంజారా, లంబాడా, సుగాళీలు బిసి జాబితాలో ఉన్నారని కోర్టులో వేసిన పిటిషన్ లో తెలిపారు. పిటిషన్ విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్ జే కే మహేశ్వరి, జస్టిస్ బిష్ణోయ్ ధర్మాసనం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో రిజైండర్ దాఖలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.
Bhumana Karunakar Reddy: మా నైతికతను ప్రజల్లో పలుచన చేయాలని చూస్తున్నారు.. అది సాధ్యం కాదు..!