Udaipur Files: 2022లో నూపుర్ శర్మ ‘‘మహ్మద్ ప్రవక్త’’పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో సమర్థించిన కారణంగా, ఉదయ్‌పూర్‌కు చెందిన దర్జీ కన్హయ్యలాల్‌ని ఇద్దరు మతోన్మాదులు మహ్మద్ రియాజ్, మహ్మద్ గౌస్ హత్య చేశారు. ఆయన షాప్‌లోనే శరీరం నుంచి తలను వేరు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కథాంశం ఆధారంగా నిర్మించిన "ఉదయ్‌పూర్ ఫైల్స్ - కన్హయ్య లాల్ టైలర్ మర్డర్" సినిమాకు న్యాయపరమైన చిక్కులు…
Supreme Court: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. డీలిమిటేషన్‌పై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం, దేశంలో తదుపరి జనాభా లెక్కలు (జనగణన) జరిగే 2026 తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు (డీలిమిటేషన్) సాధ్యమని స్పష్టం చేసింది. iOS 26 Public Beta: లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో…
Supreme Court: గతేడాది తన అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో కీలక నిందితుడిగా కన్నడ స్టార్ హీరో దర్శన్ ఉన్నాడు. దర్శన్‌తో పాటు అతడి భాగస్వామి పవిత్ర గౌడ కూడా నిందితురాలు. రేణుకాస్వామిని కర్ణాటకలో చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి, దారుణంగా చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు. అయితే, కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది.
Supreme Court: ఒడిశా బాలాసోర్‌లో ఉపాధ్యాయుడి నుంచి లైంగిక వేధింపులు ఎదురకావడంతో 20 ఏళ్ల బి.ఎడ్ విద్యార్థిని ఆత్మాహుతి చేసుకుని మరణించిన సంఘటనను సుప్రీంకోర్టు "సిగ్గు"గా అభివర్ణించింది. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల బాలికలు, గృహిణులు, పిల్లల సాధికారత కల్పించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో సూచించాలని సుప్రీంకోర్టు కోరింది. సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం తరపు న్యాయవాది ఈ సంఘటనను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత న్యాయమూర్తులు సూర్యకాంత్ , జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ…
Supreme Court: కన్వర్ యాత్రం మార్గంలోని ఉన్న హోటళ్లు , రెస్టారెంట్లలో క్యూఆర్ కోడ్లను ప్రదర్శించాలని ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఆదేశించాయి.అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, రెండు రాష్ట్రాల ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. క్యూఆర్ కోడ్ ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
నోట్ల కట్ల వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అడ్డంగా బుక్ అయ్యారు. ఇంట్లో అగ్నిప్రమాదం కారణంగా మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు కనిపించాయి.
యెమెన్‌లో ఉరిశిక్ష పడిన భారత సంతతి నిర్సు నిమిషా ప్రియకు ప్రస్తుతం ఊరట లభించింది. నిమిషా ప్రియకు ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది.
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం నెలకొంది. కేసు ఛార్జిషీటులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరును చేర్చడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ పై ఈ కేసులో పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేసింది.
నోట్ల కట్ల వ్యవహారంలో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న తరుణంలో సుప్రీం ధర్మాసనాన్ని వర్మ ఆశ్రయించారు.