Supreme Court: బీహార్ SIRపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- బీహార్ SIRపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- ఆధార్ కూడా దరఖాస్తులో చేర్చాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై ప్రతిపక్షాల తీవ్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల వేదికగా విపక్షాలు నిరసనలు కొనసాగించాయి. ఇక కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్‌లో ఓటర్ యాత్ర చేపట్టారు. బీహార్‌లో 65 లక్షల ఓట్లను తొలగించడంపై ఇండియా కూటమి పోరాటం చేస్తోంది. అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం పని చేస్తోందని ఆరోపిస్తోంది.
ఇది కూడా చదవండి: DK Shivakumar: అసెంబ్లీలో డీకే.శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతాలాపన.. బీజేపీ నేతలు చిరునవ్వులు.. దేనికి సంకేతం
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
తాజాగా ఇదే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. బీహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమయంలో ఓటర్లు సమర్పించే 11 పత్రాల్లో ఆధార్‌ను కూడా చేర్చాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు తెలిపింది. ఇక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో తొలగించబడిన ఓటర్ల పేర్లను సరిదిద్దడానికి రాజకీయ పార్టీలు ముందుకు రాకపోవడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక బూత్-లెవల్ ఏజెంట్లకు స్థానికుల గురించి అవగాహన ఉంటుందని అభిప్రాయపడింది. వలసదారుడు ఎవరో.. స్థానికుడెవరో వారికి బాగా తెలుస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: Putin: ఆ 3 కండీషన్స్ ఒప్పుకుంటేనే శాంతి చర్చలు.. తేల్చి చెప్పిన పుతిన్!
గురువారం బీహార్ ఓటర్ల జాబితాల సవరణపై నివేదికను ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ముందు ఉంచింది. ప్రత్యేక సర్వే తర్వాత 65 లక్షల ఓట్లను తొలగించినట్లు తెలిపింది. అయితే ఈ డేటాను ఆన్‌లైన్‌లో పొందిపరచాలని సూచించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి బెంచ్ ఆగస్టు 19 వరకు గడువు విధించింది. ఇక పౌరులు తమ ఆధార్ కార్డు కాపీ దరఖాస్తులో పెట్టొచ్చని స్పష్టంగా ఈసీ తెలియజేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో రాష్ట్ర స్థాయి జాబితాను కూడా అందుబాటులో ఉంచాలని తెలిపింది.
అక్టోబర్ లేదా నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్‌లో తుది ఓటర్ జాబితా విడుదల చేయనుంది. అనంతరం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందుకోసం ఈసీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇక అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!