అధిక జనాభా సమస్యను నియంత్రించేందుకు నియమాలు, నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Supreme Court Closes Contempt Proceedings In Babri Masjid Demolition Case: బాబ్రీ మసీద్ కేసులో ధిక్కార పిటిషన్లపై కీలక తీర్పును వెల్లడించింది సుప్రీంకోర్టు. బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో దాఖలైన అన్ని కోర్టు ధిక్కరణ కేసులను ముగించింది సుప్రీం ధర్మాసనం. 1992లో అయోధ్యంలో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, బీజేపీ నాయకులపై నమోదు అయిన ధిక్కరణ పిటిషన్లను క్లోజ్ చేసింది. జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం.. బాబ్రీ మసీదు…
Bengaluru Idgah Maidan Case- Supreme Court: బెంగళూరులోని ఈద్గా మైదాన్లో గణేష్ చతుర్థి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం వివాదానికి దారి తీసింది. కర్ణాటక వక్ఫ్ బోర్డు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ కేసులు ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరింది. అంతకుముందు రోజు ఈ కేసులు విచారించిన ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో న్యాయమూర్తులు పరస్పరం విభేదించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రస్తుతం ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం వినాయక చతుర్థి పండగ ప్రారంభం…
కేరళ జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్ బెయిల్ పిటిషన్పై సమాధానమివ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్. జస్టిస్ ఎస్. రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం సిద్ధిక్ కప్పన్ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
Noida Twin Tower Demolition: నోయిడా ట్విన్ టవర్స్ పేకమేడలా కూల్చివేతకు సమయం ఆసన్నమైంది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 నుంచి కూల్చివేత ప్రక్రియ ప్రారంభమై దాదాపుగా 15 నిమిషాల వ్యవధిలోనే కూల్చివేత ప్రక్రియ పూర్తవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నోయిడాలోని సెక్టార్ 93ఏలో ఉన్న ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 28న కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ట్విన్ టవర్స్ కూల్చివేసేందుకు సెక్టార్ 93ఏ లోని ప్రజలను…
Justice Lalit will take charge as the CJI of the Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పదవీ విరమణ చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జస్టిస్ యు. యు. లలిత్ 1957 నవంబరు 9న జన్మించారు. 1983 జూన్ లో…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నేడు పదవీ విరమణ చేస్తున్నారు. పదవీ విరమణ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తనకు జీవితంలో ఎదురైన అనేక విషయాలను గుర్తుచేసుకున్నారు. జీవితంలో తనకు విద్య నేర్పిన గురువులకు, స్ఫూర్తినిచ్చిన వారికి రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.
Supreme court on Freebies Case: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ రోజు.. రాజకీయ పార్టీల ఉచితాలపై కీలక తీర్పు వెల్లడించారు. ఎన్వీ రమణ పదవీ విరమణ చివరి రోజు సందర్భంగా సుప్రీంకోర్టు వాదనల్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. దేశంలో ప్రస్తుతం కీలకంగా మారిన రాజకీయ పార్టీ ఉచితాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సమస్యను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది