అల్లోపతి వంటి ఆధునిక వైద్య విధానాలపై యోగా గురువు బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మంగళవారం అసహనం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించేందుకు ప్రచారాలను నిర్వహించవచ్చని, అయితే ఇతర వ్యవస్థలను విమర్శించకూడదని పేర్కొంది.
శివసేన పార్టీ చీలిక నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.
DOLO-65O makers spent Rs 1,000 crore as freebies on doctors for prescribing: మైక్రో ల్యాబ్స్ ఫార్మా కంపెనీపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా సమయంలో డాక్టర్లు ఎక్కువగా డోలో -650 మెడిసిన్ సూచించారు. మైక్రోల్యాబ్స్ ఫార్మా కంపెనీ డోలో-650 ట్యాబ్లెట్లు వేసుకోవాలని డాక్టర్లకు సూచించాలని.. డాక్టర్లకు రూ.1000 కోట్ల తాయితాలు ఇచ్చింది. ఈ కేసుపై విచారించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని…
SC will hear plea to declare ‘Ram Setu’ national heritage monument: ‘రామసేతు’ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ.. బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును లిస్టింగ్ చేయాలని స్వామి కోరగా... దాన్ని జస్టిస్ చంద్రచూడ్ దర్మాసనం
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యను ఫిఫా సస్పెండ్ చేయడంపై బుధవారం నాడు తక్షణ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానంలో ప్రస్తావించారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో దోషిగా ఉన్న ఏజీ పెరారివాలన్‌ను అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు మే నెలలో విడుదల చేయగా.. దీనిని ఉదహిరిస్తూ నళిని సుప్రీం కోర్డు మెట్లెక్కారు.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయడం మరియు పంపిణీ చేయడం తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు పేర్కొంది, దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందని వ్యాఖ్యానించింది..
మహమ్మద్ ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమెపై దేశవ్యాప్తంగా నమోదైన 10 కేసులపై విచారణను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది.