Central Government File Affidavit on Ukraine Returnee Medical Students: ఉక్రెయిన్ విద్యార్థులకు నిరాశే ఎదురైంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశాన్ని వదిలిపెట్టి ఇండియాకు చేరుకున్న విద్యార్థుల కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు ఇండియాలోని వైద్య కళాశాల్లో అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందడం చట్టపరంగా…
న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. గత వారం జరిగిన సంయుక్త సమావేశంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును తక్షణమే సవరించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.
BCCI: బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ, సెక్రటరీ జైషాలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మరో మూడేళ్లు పాటు తమ పదవుల్లో కొనసాగేందుకు రూట్ క్లియర్ చేసింది. బీసీసీఐ ఆఫీస్ బేరర్లకు సంబంధించిన కూలింగ్ పీరియడ్ రూల్ తొలగించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ చేసిన రాజ్యాంగ సవరణలకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. స్టేట్ అసోసియేషన్లో ఆరేళ్లు, బీసీసీఐలో ఆరేళ్లు సహా ఆఫీస్ బేరర్లు 12 ఏళ్ల పాటు నిరంతర పదవీకాలం కలిగి ఉండవచ్చని…
జ్ఞానవాపి మసీదు- శృంగర్ గౌరీ కేసులో దాఖలైన వ్యాజ్యంపై వారణాసి జిల్లా కోర్టు సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. మతపరమైన సున్నితమైన అంశంలో జిల్లా న్యాయమూర్తి ఏకే విశ్వేష్ గత నెలలో ఉత్తర్వులను సెప్టెంబర్ 12 వరకు రిజర్వ్ చేశారు.
Lakshmi Parvathi: చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ నేత లక్ష్మీపార్వతికి ఎదురుదెబ్బ తగిలింది. ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీరెవరు అంటూ సుప్రీంకోర్టు ఆమెను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై తెలుగు అకాడమీ ఛైర్పర్సన్, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు. తన కేసులో ఒకరి ఆస్తుల గురించి ప్రశ్నించడానికి తానెవరు అని అత్యున్నత నాయస్థానం ప్రశ్నించిందని.. అయితే జగన్ ఆస్తుల కేసులో శంకర్రావు ఎవరు అని…
Supreme Court To Hear Plea on marital rape: వివాహ అనంతరం భార్య అనుమతి లేకుండా బలవంతంగా శృంగారం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇంతకుముందు ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు పరస్పరం విరుద్ధమైన తీర్పులు ఇవ్వడంతో సమస్య ఏర్పడింది. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. కాగా ఈ కేసును సెప్టెంబర్ 16న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
Supreme Court set to hear pleas challenging Citizenship Amendment Act (CAA) on September 12: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ)-2019కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. సెప్టెంబర్ 12న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ తో కూడిన ధర్మాసనం ఈ అంశానికి వ్యతిరేకంగా నమోదైన 200కి పైగా పిటిషన్లను విచారించనుంది. 2019లో ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీతో పాటు కొన్ని చోట్ల…
Supreme Court denies to entertain plea seeking Nupur Sharma's arrest: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేయాలంటూ అందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను శుక్రవారం తోసిపుచ్చింది. ఈ పిటిషన్ ఉపసంహరించుకోవాలని సూచించింది. దీంతో పిటిషనర్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. గత నెలలో నుపుర్ శర్మపై ఎలాంటి బలవంతపు…