The Supreme Court released the three accused under the benefit of doubt: 2012లో ఢిల్లీలో జరిగిన అత్యాచార కేసులో మరణశిక్ష పడిన ముగ్గురు నిందితులను సుప్రీంకోర్టు సోమవారం విడుదల చేసింది. ఈ ముగ్గురిపై కేసు నిరూపించడంతో ప్రాసిక్యూషన్ విఫలమైందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ‘‘ బెనిఫిట్ ఆఫ్ డౌట్’’ కింద ఈ ముగ్గురిని విడుదల చేసింది. 2019లో 19 ఏళ్ల యువతిపై అత్యాచారం, హత్య, చిత్ర హింసలు కేసు కింద ముగ్గురికి ట్రయల్ కోర్టు శిక్ష విధించింది. నిందితులు రవికుమార్, రాహుల్, వినోద్ దోషులుగా నిర్థారించిన ట్రయల్ కోర్టు వీరి ముగ్గురికి మరణశిక్ష విధించింది. ఢిల్లీ హైకోర్టు దీనిని సమర్థించింది. వీరి ముగ్గురిని ఎరకోసం వేటాడే వేటగాళ్లతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
అయితే ఈ ముగ్గురు తమ శిక్షను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా దోచులను నిర్థారించే సమయంలో కోర్టు‘‘ పాసివ్ అంపైర్’’లా వ్యవహరించిందని చీఫ్ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేల ఎం త్రివేదిల త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ ముగ్గురిపై అభియోగాలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలం అయిందని పేర్కొంది. నిందితులను గుర్తించే క్రమంలో చాలా తప్పులు జరిగాయని తెలిపింది. విచారణ సమయంలో 49 మంది సాక్షుల్లో 10 మందిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదని పేర్కొంది. దర్యాప్తు సమయంలో ఒక్కసాక్షి కూడా నిందితులను గుర్తించలేదని పేర్కొంది. కోర్టులు చట్టాలకు లోబడి కేసులను ఖచ్చితంగా గుర్తించాలి.. ఎలాంటి బయటి నైతిక ఒత్తిళ్లకు ఇతరత్రా ప్రభావాలకు లోనుకాకూడదని పేర్కొంది.
Read Also: Lunar Eclipse Live: ప్రారంభమైన సంపూర్ణ చంద్రగ్రహణం.. మూతపడ్డ ఆలయాలు
ఈ ఆత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు కారణం అయిన నిర్భయ ఘటనకు కొన్ని నెలల ముందు జరిగింది. ఉత్తరాఖండ్ కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి గురుగ్రామ్ లోని సైబర్ సిటీలో పనిచేస్తుంది. విధులు ముగించుకుని వస్తున్న సమయంలో అపహరణకు గురైంది. ఈ ఘటన 2012 ఫిబ్రవరిలొో జరిగింది. కిడ్నాప్ జరిగిన కొన్ని రోజులకు హర్యానాలోని రేవారీ జిల్లాలోని ఒక పొలంలో యువతి మృతదేహం దారుణమైన పరిస్థితుల్లో కనిపించింది. కారులోని టూల్స్ సహాయంతో, మట్టికుండలతో కొట్టి చంపినట్లు తేలింది. అంతే కాకుండా.. యువతి కళ్లలో యాసిడ్ యాసిడ్ పోసి, ఆమె ప్రైవేటు పార్టుల్లో మద్యం బాలిళ్లను దూర్చి అత్యంత పాశవికంగా హత్య చేశారు నిందితులు.
ఈ కేసులో కింది కోర్టు విధించిన ఉరి శిక్షను తగ్గించాలని కోరుతూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీన్ని ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. నేరం బాధితురాలిపైనే కాకుండా సమాజంపై జరిగిందని వారు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది గుడ్డి న్యాయవ్యవస్థ యఅని.. తాము విచారణ కొనసాగిస్తామని నొక్కి చెప్పారు.