AP Capital Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో మరో కీలక పరిణామం జరిగింది. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఈనెల 23న ఏపీ రాజధాని అంశంపై విచారణ జరగనుంది. మరోవైపు ఇవాళ పార్లమెంట్‌లో ఏపీ రాజధానిపై ప్రశ్నించారు ఎంపీ విజయసాయిరెడ్డి. దీనిపై కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం అమరావతి అంశం కోర్టు పరిధిలో ఉందని స్పష్టం చేసింది. మూడు రాజధానుల అంశంపై కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం సంప్రదించలేదని వివరణ ఇచ్చింది. అయితే, ఈ కేసుపై జనవరి 31న విచారణ జరగాల్సి వుంది. కానీ, ఆరోజు బెంచ్ మీదకు రాలేదు. ఈ నేపథ్యంలో అమరావతిపై దాఖలైన కేసులను తక్షణమే విచారించాలని సుప్రీంకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌కు ఏపీ ప్రభుత్వం శనివారం లేఖ రాసింది.. రాజధాని రైతు పరిరక్షణ సమితి, ఏపీ ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ వాదనల్లో గతేడాది నవంబర్ 28న విచారణ జరగగా.. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు..
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్