Minister Appala Raju on Capital Vizag: కొందరు ఏపి కి రాజధాని ఏది అంటూ వ్యంగంగా మాట్లాడుతున్నారు. మాది ఆంద్రప్రదేశ్ -మా రాజధాని విశాఖ ..అందరూ గుర్తుపెట్టుకోండి అన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా వైసిపి కార్యాలయం నిర్మాణానికి పెద్ద పాడు జాతీయ రహదారి సమీపంలో శంఖుస్థాపన చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెల్లేందుకు అనేక అద్యాయనాలు చేసి విశాఖని పరిపాలనా రాజధానిగా నిర్ణయించాం. అన్ని ప్రాంతాల వారిని ఒకేరీతిలో చూడాలనేధి మా భావన. అందుకే వికేంద్రీకరణ చేయాలనుకున్నాం. కొందరు కోర్టులకు వెళ్లి ముందరి కాళ్లకు బందం వేయాలని చూస్తున్నారు.
Read Also: Samantha: దేవరకొండ ఫాన్స్ కి సారీ చెప్పిన సమంతా…
అఫీషియల్ గా సిఏం జగన్ స్వయంగా చెప్పారు. అతి త్వరలో శుభ ముహూర్తాన విశాఖలో సిఎం జగన్ అడుగు పెట్టబోతున్నారు. వారి మనుషలుకోసం అమరావతి లాంటి ల్యాండ్ స్కాం ను తయారు చేసారు చంద్రబాబు. చంద్రబాబు కు జగన్ ప్రకటన చెంపపెట్టు . అమరావతి యాత్ర అని చంద్రబాబు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూసారు .. ప్రజలనుండి వ్యతిరేఖతతో ఆపివేసారు. లోకేష్ కి బట్టలు ఊడదీసి కోట్టే పరిస్థితి బాదుడే బాదుడులో కలిగింది. లోకేష్ ని భలవంతంగా నడిపిస్తున్నారు. లోకేష్ ని పాదయాత్ర చేయించగలరుకాని ..స్పందనని ప్రజల్లో తెప్పించలేరు. పది మంది కూడా లేకుండా వెర్రిబాగులోడులా .. పాదయాత్ర చేస్తున్నాడు లోకేష్. పాదయాత్రని ఎవరూ పట్టించుకోవడంలేదు. జన ప్రవాహం లోకేష్ వెంట ఉందని చూపించండి. పాదయాత్ర గురించి మరి మాట్లాడదలుచుకోలేదు.
Read Also: Layoff in paypal : నేడు పే పాల్ వంతు.. ఊడిపోయిన 2000ఉద్యోగాలు