Supreme Court: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల 8న విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును నేడు విచారించనున్నట్లు ప్రకటించారు. ఈ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున దుశ్వంత్ ధావే వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల ప్రలోభాలకు సంబంధించిన కీలక అంశాలు సిట్ విచారణలో వెలుగుచూశాయని దుష్యంత్ ధావే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
Read also: Sunday Funday: నగర ప్రజలకు గుడ్ న్యూస్.. మరింత ఆకర్షణీయంగా సన్‌డే ఫన్‌డే..
ఈ ఆధారాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని ధావే హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సాక్ష్యాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని ధావే ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ సాక్ష్యాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని ధావే అన్నారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని దుష్యంత్ ధావే కోరారు. ఈడీ, సీబీఐ, ఐటీ కేసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మెటీరియల్స్ మీడియాకు లీక్ అవుతున్నాయని, వీటిని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించిన ఆధారాలను మీడియాతో పాటు న్యాయమూర్తులకు పంపించామని దుష్యంత్ ధావే గుర్తు చేశారు. ఈ కేసును ఈ నెల 27న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
Big Breking: పేలిన బెలూన్లు.. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు గాయాలు