Amara Raja Batteries: అమర రాజా బ్యాటరీస్ కాలుష్యం వ్యవహారంలో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టే ఎత్తివేసింది సుప్రీంకోర్టు.. అమర రాజా బ్యాటరీస్ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని.. పరిసర ప్రాంతాల జలాల్లో లెడ్ కంటెంట్ పెరిగిందని గతంలో నోటీసులు ఇచ్చింది ఏపీ కాలుష్య నియంత్రణ మండలి.. 34 సార్లు నోటీసులు ఇచ్చి రాజకీయ కారణాలతో తమను వేధిస్తున్నారని అమర్ రాజా తరఫున వాదించారు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి.. అయితే, రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ చట్టప్రకారం ముందుకు పోవాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. షోకాజ్ నోటీస్ పై చట్ట ప్రకారం పబ్లిక్ హియరింగ్ నిర్వహించి.. చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీసీబీ)కి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. అయితే, పీసీబీఐ ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది.
Read Also: Nandamuri Tarakaratna: అశ్రునయనాల మధ్య తారకరత్న అంత్యక్రియలు పూర్తి