Crime: తల్లిదండ్రులను వేధించిన కొడుకు.. వాటర్ ట్యాంకులో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య
- తల్లిదండ్రులను వేధించిన కొడుకు
- వాటర్ ట్యాంకులో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య
- ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు
- విచారణ నిమిత్తం రంగంలోకి ఎస్పీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లోని నాగౌర్‌లోని కర్ణి కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వృద్ధ దంపతులు వాటర్ ట్యాంక్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. హజారీరామ్ (70), ఆయన భార్య చావ్లీ (68) ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబంలో విబేధాలు నెలకొనడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ చర్యకు దిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రెండు రోజులుగా వృద్ధ దంపతులు కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారు కుమారుడికి సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు కొత్వాలి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటికి వెళ్లి చూడగా నీరు నిండిన ట్యాంక్ మూత తెరిచి ఉండడంతో అందులో ఇద్దరి మృతదేహాలు పడి ఉన్నాయి.
READ MORE: Archana Kochchar: ఫ్యాషన్ షోలో తుళ్లిపడ్డ అర్చన కొచ్చర్.. ఆ తర్వాత ఏం చేసిందంటే..!
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
ఈ కేసులో వెలుగులోకి వచ్చిన అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే.. హజారీరామ్ ఆత్మహత్యకు ముందు ఇంటి గోడలపై చాలా చోట్ల సూసైడ్ నోట్‌లు అతికించారు. పోలీసులు ఈ సూసైడ్ నోట్‌లను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. సూసైడ్ నోట్‌లో హజారీరామ్ తన కొడుకులు, వారి భార్యలు మరియు కొంతమంది బంధువులు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. కుటుంబ ఆస్తి తగాదాలు, ఇతర బంధువుల కారణంగా దంపతులు మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు నోట్‌లో రాసి ఉంది. ఈ ఘటన తీవ్రతను గమనించిన ఎస్పీ నారాయణ్ తొగస్, ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను ట్యాంకు నుంచి బయటకు తీసి మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?