అతిచిన్న వయసులోనే అమెరికా నర్తకి తనువు చాలించింది. అర్ధాంతరంగా ప్రాణాలు విడిచింది. ఆ ఘటన ఆమె అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. అయితే సూసైడ్ వెనుక ఉన్న మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు.
యూపీలోని ఎటావాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయి ఏడేళ్లయినా ఓ మహిళ తల్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకుంది. అయితే.. తన అత్తమామలు, భర్త కూడా పిల్లలు కావడం లేదని కొట్టి హింసించే వారని మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు.
పారిస్ పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నవదీప్ సింగ్.. తన జీవితంలో పడ్డ కష్టాలు, అవమానాల గురించి చెప్పాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. పారాలింపిక్స్ 2024లో జావెలిన్ త్రో F41 విభాగంలో నవదీప్ బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే..
మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ బస్సు బాడీ బిల్డింగ్ దగ్గర చెట్టుకు ఉరి వేసుకొని రహీం(32) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Big Breaking: దేశంలోని ప్రముఖ సైకిళ్ల తయారీ కంపెనీ అట్లాస్ మాజీ చైర్మన్ సలీల్ కపూర్ మంగళవారం (సెప్టెంబర్ 3) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం విచారణ జరుపుతోంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. Minister Ponguleti: ముందస్తు చర్యల వల్ల మూడు వేల మందిని రక్షించాం.. అట్లాస్ సైకిల్ మాజీ…
అస్సాంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ జవాన్ భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి బ్రహ్మపుత్ర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్కు ముందు వాట్సాప్‌లో 'సారీ పిల్లలు' అని రాసింది. ఈ క్రమంలో.. దిబ్రూగఢ్‌లోని బోగిబీల్ బ్రిడ్జి టి-పాయింట్ సమీపంలో మహిళ, ఆమె పిల్లల కొన్ని వస్తువులను పోలీసులు గుర్తించారు. ఇది ఆత్మహత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ నాగర్ కొత్వాలి ప్రాంతంలోని చిల్బిలా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష కోసం యువకుడు బయల్దేరగా.. ప్రియురాలు కూడా తనతో పాటు రైల్వే స్టేషన్ కు వచ్చింది. వారికి ఏ సమస్య వచ్చిందో తెలియదు గానీ.. రైలు దగ్గరికి రాగానే దాని ముందు దూకి సూసైడ్కు…
ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే మోసం చేయటంతో పాటు వరకట్న వేధింపులకు గురి చేయటంతో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట రిక్షాపుల్లర్ కాలనీలో నివసించే తాళ్ళపల్లి రాజశేఖర్ ప్రస్తుతం అల్వాల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. తన ఇంటి వద్దే ఉన్న మనీషా(27) అనే యువతిని ప్రేమించటంతో, ఆ యువతి వారి ప్రేమ…
ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌లో సామూహిక అత్యాచారానికి గురై ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే.. ఈ కేసును ఎఫ్‌ఐఆర్‌లో గ్యాంగ్ రేప్ కింద చేర్చడానికి పోలీసులు నిరాకరించారు. దానికి బదులుగా ఆత్మహత్యకు ప్రేరేపించే సెక్షన్‌లను జోడించారని మృతురాలి తండ్రి చెప్పాడు. దీంతో.. ఈ కేసుపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.
ఫేస్‌బుక్ లైవ్ చేస్తూ మహిళా న్యాయవాది ఆత్మహత్య చేసుకున్న ఘటన లక్నోలో జరిగింది. ఆమె సివిల్ కోర్టు మూడో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకునడాన్ని చూసి లాయర్లు కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. ఆమె కోర్టు భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను బలరాంపూర్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.