భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ పోలీస్ కానిస్టేబుల్ బుక్యా సాగర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తాజాగా నేడు చికిత్స పొందుతూ ఆయన మరణించారు. జిల్లాలోని బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో బుక్యా సాగర్ విధులు నిర్వర్తించారు. ఓ గంజాయి కేసులో తనని బలిపశువుని చేశారని, చేయని నేరాన్ని తనపై మోపారని, నిందను భరించలేక పురుగులు మంది తాగి చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో బాధితుడు పేర్కొన్నారు. గంజాయి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. చర్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.. దీంతో.. మనస్థాపానికి గురైన కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం.. ఆయన ఆస్పత్రిలో మృతిచెందడం సంచలనంగా మారింది..
READ MORE: AP Rain Alert: ఏపీకి పొంచి ఉన్న మరో తుఫాన్ గండం.. రేపటి నుంచి భారీ వర్షాలు
గతంలో బూర్గంపాడులో పనిచేసిన ఇద్దరు ఎస్ఐలు సంతోష్ ,రాజకుమార్, బీఆర్‌ఎస్ నాయకుడు నాని తనని బలిపశువుని చేశారని వీడియోలో తెలిపారు. పురుగులు మందు తాగిన తర్వాత సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు సెండ్ చేశాడు. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు సాగర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి ఆయన మరణించారు.