Ghatkesar: కారు దగ్ధం కేసులో ట్విస్ట్.. సజీవదహనం అయిన ఆ జంట ఎవరంటే..!
- ఘట్‌కేసర్ కారు దగ్ధం కేసులో ట్విస్ట్
- మృతులు ప్రేమ జంటగా గుర్తించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో సోమవారం కారు దగ్ధమై ఇద్దరు సజీవదహనం అయ్యారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కారులో ఉన్న జంట జీవదహనం అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదం ప్రమాదశాత్తు జరిగింది కాదని పోలీసులు తేల్చారు. ఇద్దరూ ప్రేమికులని.. ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Venkatesh: పెళ్ళాలకి మీ ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు
Also Read
శ్రీరామ్ (26), లిఖిత (16) గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఘట్‌కేసర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో లిఖిత ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇక శ్రీరామ్.. ఘట్‌కేసర్ నారపల్లిలో సైకిల్ షాపు నడుపుతున్నాడు. అయితే ప్రేమికులిద్దరూ రహస్యంగా ఉన్నప్పుడు చూసిన వ్యక్తులు.. శ్రీరామ్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రేమికుల నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా టార్చర్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు శ్రీరామ్ తన సోదరికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఇద్దరం చనిపోతున్నట్లు తెలిపాడు. అనంతరం ఘట్‌కేసర్‌లోని ఘనాపూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు దగ్గర కారులో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు 3 పేజీల నోట్‌ను స్వాధీనం చేస్తున్నారు. శ్రీరామ్ నడిపిస్తున్న సైకిల్ షాపు పక్కనే లిఖిత నివాసం ఉంటుంది. మృతులు ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Naga Vamsi: అన్ స్టాపబుల్ షోలో జూ.ఎన్టీఆర్ పంచాయితీ.. నాగవంశీ క్లారిటీ
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?