హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది.. పెళ్లయిన నెల రోజులకే గంట విజయ గౌరీ(20) ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ఆ యువతికి గత నెల ఫిబ్రవరి 6న నందిగామ విజయనగరానికి చెందిన ఈశ్వర రావు(35) తో వివాహం జరిగింది.. మృతురాలి స్వస్థలం పార్వతీపురం. ఉద్యోగ నిమిత్తం నగరానికి వచ్చిన ఈశ్వరరావు బాలనగర్ పీఎస్ పరిధిలోని బాల్ రెడ్డినగర్‌లో ఇల్లు తీసుకొని అద్దెకు ఉంటున్నాడు.. గత నెల 16 వతేదీన విజయగౌరి వాళ్ల అమ్మతో కలిసి భర్త దగ్గరకు వచ్చింది..
READ MORE: Samyuktha Menon : మహిళా దినోత్సవం.. ‘షార్ట్ ఫిలిం’ సమర్పించిన గోల్డెన్ లెగ్ బ్యూటీ
ఈ నెల 3 వతేదీన గౌరి అమ్మ స్వంత ఊరికి వెళ్లింది.. 7 వ తేదీ ఉదయం గౌరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి క్షేమంగా ఉన్నానంటూ చెప్పింది.. కానీ డ్యూటికి వెళ్లిన భర్త సాయంత్రం వచ్చేసరికి తలుపు వేసి ఉంది. ఎంత పిలిచినా సమాధానం లేకపోవడంతో తలుపులు బద్ధలు గొట్టి చూసే సరికి గౌరి ఉరి వేసుకొని కనిపించింది.. దీంతో భర్త ఈశ్వరరావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ హాస్పటల్ కు తరలించారు.. ఈ రోజు పార్వతీపురం నుంచి వచ్చిన మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మాకు ఎవరి మీద ఎలాంటి అనుమానం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం..
READ MORE: Samyuktha Menon : మహిళా దినోత్సవం.. ‘షార్ట్ ఫిలిం’ సమర్పించిన గోల్డెన్ లెగ్ బ్యూటీ