కర్ణాటకలోని బెళగావిలో దారుణం జరిగింది. పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిందని యువతిని చంపి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఐశ్వర్య మహేష్ లోహర్ (20)ని ప్రశాంత్ కుండేకర్ (29) అనే యువకుడు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Exclusive : మెుదటివారమే ఖాళీ.. కలెక్షన్స్ మాత్రం 100 కోట్లు
బెళగావి తాలూకాలోని యెల్లూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ కుండేకర్(29).. పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఐశ్వర్య అనే యువతిని ఏడాది కాలంగా ఇష్టపడుతున్నాడు. ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడుతున్నాడు. అంతేకాకుండా.. ఆమెను పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్య తల్లిని కలిసి అడిగాడు. అయితే ముందు ఆర్థికంగా స్థిరపడు.. ఆ తర్వాత పెళ్లి విషయం ఆలోచిస్తామని సలహా ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Hyderabad : మలక్ పేట్ శిరీష హత్య కేసులో ట్విస్ట్ ..
బుధవారం తెల్లవారుజామున ప్రశాంత్… ఐశ్వర్య ఇంటికి విషపు సీసాతో వచ్చాడు. తనను వివాహం చేసుకోవాలని ఐశ్వర్యను మరోసారి పట్టుబట్టాడు. అందుకు ఆమె నిరాకరించింది. కోపోద్రేకుడైన అతడు.. ఆమెతో విషం తాగించేందుకు ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ప్రశాంత్ తన జేబులోంచి కత్తిని తీసి ఆమె గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ఐశ్యర్య ప్రాణాలు కోల్పోయింది. వెంటనే అదే కత్తితో ప్రశాంత్ గొంతుకోసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ యాడా మార్టిన్ సహా సీనియర్ పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Singer Kalpana: కల్పన ఆత్మహత్యాయత్నంలో కీలక ట్విస్ట్! అసలేం జరిగిందంటే..!