Warangal Crime : వరంగల్ లో కలకలం.. పత్తిమిల్లు యజమాని ఆత్యహత్యాయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ ఎదుట రఘురాం అనే పత్తి మిల్లు యజమాని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు.
అనంతరం రఘురాం మాట్లాడుతూ.. పత్తి మిల్లు నడవాలంటే లంచం డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదివరకు గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేసిన స్పందించలేదని అన్నాడు. దిక్కుతోచని స్థితిలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టానని వాపోయాడు. మరోసారి గ్రీవెన్ సెల్ కు వచ్చిన అధికారులు స్పందించకపోవడంతో.. ఆత్మహత్యకు యత్నించిన రఘురాం కన్నీరుమున్నీరు అయ్యాడు.
Also Read
ఇదివరకు 45 వేలు లంచంగా ఇచ్చానని రఘురాం చెప్పుకొచ్చాడు. బేల్ కు 50 వేల చొప్పున ఇవ్వాలని, కాటన్ సెక్షన్ అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారని రఘురాం ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన మిల్లుకు పత్తి కేటాయించడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. తను డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేనని అధికారులను వేడుకున్నా స్పందించలేదని వాపోయాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన పత్తి మిల్లును నడుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారుడు. తనకు తగిన న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!