దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి యూపీఎస్సీ పరీక్షలు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం అంటే ఆషామాషీ కాదు. ఇలాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వ్యక్తులకు కరెంట్ సమస్యలు వంటివి తలెత్తకుండా ఉండాలి. అప్పుడు వారి విద్య సాఫీగా సాగుతుంది. బీహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆ రాష్ట్రం ఎన్నో రకాలుగా వెనబడి ఉన్నది. కానీ, ఇప్పుడు కొంతమేర అభివృద్ది చెందింది. కానీ, కొన్ని గ్రామాల్లో పరిస్థితులు దుర్భరంగా ఉంటాయి. గ్రామాల్లో ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు ఉండదో చెప్పలేని పరిస్థితి. సాసారామ్ రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉండే గ్రామాల్లో కరెంట్ కష్టాలు దారుణంగా ఉంటాయి. దీంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ రైల్వేస్టేషన్‌లోని రెండు ప్లాట్ ఫామ్ ల వద్దకు చేరుకొని పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు ప్లాట్ ఫామ్‌లు విద్యార్థులతో నిండిపోతాయి. విద్యార్థుల కోసం అక్కడ 24 గంటలు కరెంట్ సదుపాయం ఏర్పాటు చేశారు.
Read: కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రధానికి లేఖ: నోటుపై గాంధీ బొమ్మను తొలగించండి…