ఇంజనీరింగ్ కాలేజీల్లో బి కేటగిరి(యాజమాన్య కోట) సీట్లు నిబంధనలకు విరుద్దంగా కేటాయిస్తున్నారని, కొన్ని కాలేజిలో ఇప్పటికే సీట్లు అమ్ముకున్నారని అడ్మిషన్స్, ఫి రెగ్యులేటరీ కమిటీ కి ఫిర్యాదు చేసింది ఏబీవీపీ. ఈ ఫిర్యాదు పై స్పందించిన ఫీజుల నియంత్రణ కమిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లకు సర్క్యులర్ జారీ చేసింది. ఏ కేటగిరి సీట్ల కౌన్సెలింగ్ పూర్తి అయ్యాకే యాజమాన్య కోట సీట్లకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. నోటిఫికేషన్ ఇచ్చే అడ్మిషన్స్ చేపట్టాలి. మెరిట్ ప్రకారమే అడ్మిషన్స్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఎవరి కన్నా అడ్మిషన్స్ ఇస్తే అది అక్రమం.
విద్యార్థులు తమకు ఇష్టమున్న కాలేజి లో అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు… ఏ కాలేజ్ కూడా దరఖాస్తు ని తిరస్కరించవద్దు. ఏ కాలేజ్ అయిన తిరస్కరిస్తే నేరుగా ఫీజుల నియంత్రణ కమిటీ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్స్ సమయంలో మెరిట్ ప్రకారం సీట్లు ఇవ్వక పోతే ఆధారాలతో ఫిర్యాదు చేస్తే ఆయా కళాశాలల పై చర్యలు తీసుకుంటాం అని పేర్కొంది.